హలీవుడ్ టెక్నిషియన్ తో ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
జనతాగ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 10న లాంచనంగా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. సినిమాకు జై లవకుశ అనే టైటిల్ రిజిష్టర్ చేయించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నివేదాథామస్, రాశిఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా, త్రీ ఇడియట్స్, పీకే చిత్రాలకు పనిచేసిన బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సి.కె.మురళీధరన్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నిషియన్స్‌ను రంగంలోకి దింపాడు నిర్మాత కళ్యాణ్ రామ్. ఐరన్ మ్యాన్, లార్డ్ ఆఫ్ రింగ్స్, లైఫ్ ఆఫ్ పై, రోబో చిత్రాలకు ప్రోస్థెటిక్, లెగసీ వర్క్‌ను అందించిన వాన్స్ హార్ట్ వెల్ ఈ సినిమాకు పనిచేయనున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com