స్నేహానికి విలువిచ్చే అరుదైన వ్యక్తి.. స్టార్ డైరెక్టర్ కు ఎన్టీఆర్ బర్త్ డే విషెస్!
- IndiaGlitz, [Tuesday,June 15 2021]
విజయవంతమైన చిత్రాలకు రచయితగా అనుభవం, దర్శకుడిగా కేవలం నాలుగు సినిమాలు.. నాలుగూ బ్లాక్ బస్టర్లే. హీరోయిజానికి కొత్త అర్థం చెబుతూ తెరకెక్కించిన ఆ నాలుగు చిత్రాలతో కొరటాల శివ టాలీవుడ్ టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయారు. కమర్షియల్ చిత్రాల్లో కూడా చాలా అందంగా, బలమైన సందేశాన్ని ఇవ్వగలగడం కొరటాల ప్రత్యేకత.
నేడు కొరటాల శివ పుట్టినరోజు. ఆయన 46వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా కొరటాలకు సినీ ప్రముఖుల నుంచి సన్నిహితుల నుంచి బర్త్ డే విషెస్ దక్కుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్ తో కొరటాలకు బర్త్ డే విషెస్ తెలియజేశాడు.
'స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' టీం కూడా కొరటాలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. కొరటాల శివ కెరీర్ రచయితగా 2002లో ప్రారంభం అయింది. భద్ర చిత్రానికి రచయితగా పనిచేసి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. మున్నా, బృందావనం, సింహా లాంటి చిత్రాలకు కొరటాల రచయితగా పనిచేశారు.
దర్శకుడిగా మారి తెరకెక్కించిన తొలి చిత్రం 'మిర్చి' సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా వరుస బ్లాక్ బస్టర్స్ తో కొరటాల టాప్ డైరెక్టర్ గా మారిపోయారు. తన కథలో ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకుంటారు కొరటాల.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. కరోనా ప్రభావం తగ్గాక ఈ చిత్ర రిలీజ్ పై క్లారిటీ వస్తుంది. ఆచార్య తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కొరటాల డైరెక్ట్ చేయబోతున్నారు. వీరిద్దరి కాంబోలో ఇదివరకే జనతా గ్యారేజ్ వచ్చిన సంగతి తెలిసిందే.
స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Wishing my dear friend and well wisher, @sivakoratala garu a very Happy Birthday
— Jr NTR (@tarak9999) June 15, 2021