ఎన్టీఆర్ పంచుకుంటారట!
Send us your feedback to audioarticles@vaarta.com
పేరెంటింగ్ గొప్ప కళ. నిన్నమొన్నదాకా యువకులుగా కనిపించిన హీరోలు, ఇప్పుడు తండ్రి స్థానాల్లోకి మారి ఆ పేరెంటింగ్ విశేషాలను అప్పుడప్పుడూ పంచుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు ఎన్టీఆర్, అల్లు అర్జున్. తాజాగా ఎన్టీఆర్ ఓ అంశాన్ని పేరెంటింగ్‌తో ముడిపెట్టారు. ఎన్టీఆర్‌కు రానా అమరచిత్ర కథ సీరీస్‌ను గిఫ్ట్ గా పంపారట. ఈ కామిక్ బుక్స్ లో మన పురాణాల్లోని సూపర్ హీరోల కథలన్నీ ఉంటాయి. వాటిని చూడగానే ఎన్టీఆర్‌కు తన చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చేశాయి.
వెంటనే ట్విట్టర్ వేదికగా చేసుకుని ఆ విషయాలను గుర్తుచేసుకున్నారు. తన బాల్యం గుర్తుకొచ్చిందని, తన బాల్యాన్ని, అమర చిత్ర కథలను కుమారుడు అభయ్ రామ్‌తో పంచుకుంటాననీ చెప్పేశారు. పనిలో పనిగా తనకు ఈ పుస్తకాల సీరీస్‌ను పంపిన రానాకు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోలేదు. ఫ్రెండ్స్ కి సరదాగా అప్పుడప్పుడు ఏవో గిఫ్ట్ లు పంపిస్తుంటాం. కానీ వాళ్ల పిల్లలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇలాంటి గిఫ్ట్ లు పంపడం అరుదు.
తాను చిన్నప్పటి నుంచి చందమామ, బాలమిత్ర చదివి పెరిగానని రానా ఇప్పటికే చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments