బిగ్ బాస్ కు , కంటెస్టెంట్స్ కు మధ్య నేను వారధిగా ఉంటాను - ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ స్టార్స్ అందరూ ఇప్పుడు బుల్లితెర వైపు అడుగులేస్తున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంతో అక్కినేని నాగార్జున ప్రేక్షకుల్ని అలరిస్తే, ఇప్పుడు అదే షోతో మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా స్టార్‌మా టీవీలో ప్రసారం కానున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్'. ఎన్టీఆర్ తొలిసారి బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరించనుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. బిగ్‌బాస్ షో ఈ నెల 16 నుండి ప్రసారం కానుంది. ఓ పెద్ద ఇంటిలో 12 మంది సెలబ్రిటీలను నిర్భందిస్తారు. ప్రతి ఒకరి కదలికను 60 కెమెరాలతో గమనిస్తుంటారు. తెలుగులో స్టార్ట్ అవుతున్న తొలి రియాలిటీ షో ఇది. ఈ కార్యక్రమంలో స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్‌జైన్, ఎన్టీఆర్, విన్నెంట్, జెస్సి తదితరులు పాల్గొన్నారు. బిగ్ బాస్ స్పెషల్ ప్రోమోను ఎన్టీఆర్, అలోక్ జైన్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా...
నాకు ఛాలెంజస్ అంటే ఇష్టం..
ఎన్టీఆర్ మాట్లాడుతూ - '' చాలా సార్లు మీకందరికీ చెప్పినట్లు ఛాలెంజస్ అంటే నాకు చాలా ఇష్టం. అసలు టీవీలో ఎలా హోస్ట్‌గా చేయాలని, ఎలా మాట్లాడాలనే దానిపై ఎప్పుడూ అవగాహన లేదు. కానీ ఎప్పుడైతే స్టార్‌మా బిగ్ బాస్ షోకు నన్ను వ్యాఖ్యాతగా వ్యవహరించమని అడిగారో వెంటనే రెండో నిమిషం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేశాను. నాకు బిగ్‌బాస్ షోను హోస్ట్ చేయడం సవాలుగా భావిస్తున్నాను. చాలా ఆసక్తిగా, అద్భుతమైన అనుభవం కోసం ఎదురుచూస్తున్నాను. ఇండియాలో అతి పెద్దదైన రియాలిటీ షోను తెలుగులో నేను హోస్ట్ చేస్తానని నాపై నమ్మకం ఉంచినందుకు స్టార్‌మా వారికి థాంక్స్. బిగ్‌బాస్ షోను నేను వ్యాఖ్యాతగా చేయాలని రఘు నన్ను అడిగారు. అలోక్ షో కు సంబంధించిన చాలా విషయాలను తెలియజేశారు. హిందీ షోను నేను చూడలేదు. నా కజిన్ సిస్టర్ ఒకావిడ హిందీ షోను చూస్తుంది. ఆ షోలో సల్మాన్ ఎవరో కంటెస్టెంట్‌ను తిట్టాడని, అదేదో పెద్ద వింత అయినట్లు నా దగ్గరకు వచ్చి చెప్పింది. తను అంతగా ఉద్వేగభరితంగా మాట్లాడింది. అప్పుడే బిగ్‌బాస్ గురించి నాకు తెలిసింది. నేను అప్పుడప్పుడు రెండు, మూడు షోస్ చూశానే తప్ప పూర్తి షోను ఎప్పుడూ చూడలేదు. నాతో పాటు ఇండియాలో చాలా మందికి బిగ్‌బాస్ అనేది అమేజింగ్ రియాలిటీ షో అనే నమ్మకం ఉంది. హిందీ షోను చూస్తే ఎక్కడో మనసులో అది మనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అదే ఏమీ తెలియకుండా వెళితే మనకు ఏం చేయాలో అది చేయోచ్చు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేక్షకులు మారుతూ వస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకుల సెన్సిటికీ దగ్గరగా ఉంటుంది. సోషల్ మీడియా పెరిగే కొద్తి తెలిసో, తెలియకో అందరం పబ్లిక్ లేయర్లోకి వచ్చేశాం. ఒకప్పుడు ఒక మనిషి గురించి తెలియడానికి చాలా కాలం పట్టేది. కానీ ఇప్పుడలా కాదు. అలాగే ప్రతి మనిషి గురించి తెలుసుకోవాలని మరొకరికి ఆశ ఉంటుంది. ఆ ఆలోచనే బిగ్‌బాస్ షో ను పెద్ద సక్సెస్ చేస్తుందని భావిస్తున్నాను. సోమవారం నుండి శుక్రవారం వరకు షో టెలికాస్ట్ అవుతుంది. శనివారం, ఆదివారం మాత్రమే హోస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. నేను కంటెస్టెంట్‌ను కాను. నేను షోను చూడాలనుకుంటున్నానే తప్ప పాల్గొనాలనుకోవడం లేదు. షోలో ప్రతిది ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే షోను ఎలా హోస్ట్ చేయాలో కూడా తెలియదు. కాబట్టే ఎలా చేయాలో తెలుసుకోవడం అనేది నటుడిగా ఓ అనుభవమని నమ్ముతున్నాను. ఇలా చేయాలని ఏం అనుకోవడం లేదు. స్టేజ్‌పైకి వచ్చినప్పుడు ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తాను. అందరి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఆ ఆసక్తే షోను ఒప్పుకునేలా చేసిన మొదటి అంశం. ఇక రెండో అంశం ఓ షోను హోస్ట్ చేయడం చిన్న విషయం కాదు. ఛాలెంజింగ్‌గానే భావిస్తున్నాను. నా సినిమాలనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా ఛాలెంజింగ్ ఉండటం నాకు ఇష్టం. సక్సెస్ ఫెయిల్యూర్స్‌కు అతీతంగా ఈ అనుభవం ఈరోజు కాకపోయినా మరెక్కడైనా ఉపయోగపడుతుంది. నాకు చిన్నప్పట్నుంచి చార్లిఎంజెల్స్ అంటే చాలా ఇష్టం. చార్లి కనపడడు కానీ ఎంజెల్స్ కనపడుతుంటారు. చార్లి ఎలా ఉంటాడో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఉండేది. అలాగే ఈ షోలో నేను బిగ్‌బాస్ కాను.
నేను పాల్గొనేవారికి, బిగ్‌బాస్‌కు మధ్య నేను వారధిగా ఉంటాను. కాబట్టి నేను ఇక్కడ కంటెస్టెంట్స్ గురించి ఏ వివరాలు తెలియవు. ఒకవేళ స్టేజ్‌పై వచ్చిన తర్వాత వారెవరో నాకు తెలిసే అవకాశం ఉంది. అదే రేపు ఇంట్లో నుండి ఎవరు వెళ్ళిపోతారు కూడా నాకు చెప్పరట. కేవలం నా వల్లే ఈ షోకు బజ్ వచ్చిందంటే నేను నమ్మను. మంచి షో, టీవీ ఛానెల్‌పై ఉన్న నమ్మకం వల్ల షోకు స్పందన వచ్చింది. సల్మాన్‌గారు చేసిన షోను నేను చేయడం ఛాలెంజ్‌గానే భావిస్తున్నాను. కచ్చితంగా హిందీలో సక్సెస్ అయినట్లే తెలుగులో కూడా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. షోను ఇలాగే చేయాలని నేను ప్రిపేర్ కావడం లేదు. అలా ప్రిపేర్ కావడం నాకు ఇష్టం లేదు. కంటెస్టెంట్‌ను ఎలివేట్ చేయాలా వద్దా అనేది నా చేతిలో ఉండదు. ఓటింగ్ ద్వారానే ఏదైనా నిర్ణయించబడుతుంది. స్వర్గీయ ఎన్టీఆర్‌గారు తెలుగు ప్రజల సొత్తు. ఆయన్ను ఎలా చూపిస్తారనేది చూడాలి. బాబాయ్‌గారు అందులో పాత్ర చేస్తాననడం నిజంగా బ్రహ్మాండమే. నేను అందులో చేయాలా వద్దా అనే దాని గురించి ఏం ఆలోచించలేదు`` అన్నారు.
విన్సెంట్ మాట్లాడుతూ - ''అప్పో సంస్థ స్టార్‌మాతో అసోసియేట్ కావడం ఎంతో ఆనందంగా ఉంది. మేం అదృష్టంగా భావిస్తున్నాం. బిగ్‌బాస్ గ్రేట్ షో అవుతుందని భావిస్తున్నాం'' అన్నారు.
అలోక్ జైన్ మాట్లాడుతూ - ''ఎన్టీఆర్ మా రియాలిటీ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి ఒప్పుకోవడం ఆనందంగా ఉంది. తెలుగు మార్కెట్లో బిగ్టెస్ట్ షోగా బిగ్ బాస్ జులై 16 రాత్రి 9 గంటలకు నుండి ప్రసారం కానుంది. ప్రపంచంలోని నలబై దేశాల్లో ఈ షో హ్యుజ్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడుతెలుగులో ప్రసారం కానుంది. 80 డిఫరెంట్ షోస్ మన ఇండియాలో ఉన్నాయి. అందులో 20 ప్రస్తుతం మంచి ట్రెండ్‌లో ఉన్నాయి. అయితే ఈ బిగ్‌బాస్ షో వీటన్నింటి కంటే ప్రత్యేకమైంది. తొలిసారి ఎన్టీఆర్ బుల్లితెర వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటం నాకు పెద్ద ప్లస్ అవుతుంది. ఈ షో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని కచ్చితంగా చెప్పగలను. అల్రెడి విడుదలైన ప్రోమోస్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ షో స్టార్‌మా మరింత పేరును తీసుకొస్తుందని భావిస్తున్నాను తమిళంలో కమల్‌గారు చేస్తున్న షోకు మంచి స్పందన వచ్చింది తెలుగులో 71 ' ఏపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments