ఎన్టీఆర్ చూపు...అజిత్ సినిమా వైపు...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న నాన్నకు ప్రేమతో...సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత కొరటాల శివ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తమిళ్ లో అజిత్ నటించిన వేదాళం సినిమా తెలుగు రీమేక్ లో నటించాలనుకుంటున్నట్టు సమాచారం. వేదాళం సినిమాను శివ తెరకెక్కించారు. ఈ చిత్రం అక్కడ మొదటివారంలోనే దాదాపు 45 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. గతంలో ఎన్టీఆర్ కత్తి సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. కానీ చేయలేదు. ఇప్పడు అజిత్ నటించిన వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నాడట. మరి...ఈసారైనా తమిళ రీమేక్ లో నటిస్తాడో..? లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments