ఎన్టీఆర్ విలన్‌గా జగ్గు దాదా
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోగా కంటే విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీగా ఉన్న నటుడు జగపతిబాబు. తాజా సమాచారం ప్రకారం ఈ సీనియర్ నటుడు ఎన్టీఆర్ చిత్రంలో నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో కనపడబోతున్నారు.
వివరాల్లోకెళ్తే.. తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది.
గతంలో ఎన్టీఆర్, జగపతిబాబు ఇద్దరు కలిసి 'నాన్నకు ప్రేమతో'లో కలిసి నటించారు. ఆ చిత్రంలో కూడా జగపతిబాబు నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలోనే కనిపించారు. మళ్లీ తారక్‌తో చేయబోయే సినిమాలో విలన్‌గా చేస్తుండటం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com