గోపీచంద్ సినిమాలో ఎన్టీఆర్ విలన్...

  • IndiaGlitz, [Saturday,September 17 2016]

ఎన్టీఆర్ కెరీర్‌లో పెద్ద హిట్ మూవీగా నిలిచిన జ‌న‌తాగ్యారేజ్‌లో విల‌న్ గా న‌టించిన బాలీవుడ్ న‌టుడు స‌చిన్ కేడ్‌క‌ర్ గ‌తంలో త‌మిళంలో సినిమాలు చేసినా జ‌న‌తాగ్యారేజ్ మాత్రం తెలుగులో తొలి చిత్రంగా ఎంట్రీ ఇచ్చాడు. జ‌న‌తాగ్యారేజ్‌తో న‌ట‌న ప‌రంగా తెలుగు ప్రేక్ష‌కుల్లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న స‌చిన్‌కు తెలుగులో వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

తాజాగా సంపత్ నంది ద‌ర్శ‌క‌త్వంలో బాలాజీ సినీమీడియా బ్యాన‌ర్‌పై భ‌గ‌వాన్‌, పుల్లారావులు నిర్మిస్తున్న సినిమాలో కూడా విల‌న్‌గా స‌చిన్ న‌టించ‌నున్నాడు. హీరో, విల‌న్ మ‌ధ్య వ‌చ్చే సీన్స్ పోటాపోటీగా ఉంటాయ‌ని యూనిట్ వ‌ర్గాలు అంటున్నాయి.

More News

వ‌రుణ్‌తేజ్‌తో విజ‌య్‌కుమార్ కొండా

`గుండెజారి గ‌ల్లంత‌య్యిందే` సూప‌ర్‌హిట్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన డైరెక్ట‌ర్ విజ‌య్‌కుమార్ కొండా నెక్ట్స్ నాగ‌చైత‌న్య‌తో `ఒక లైలా కోసం` అనే ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కించాడు. ఈ రెండు సినిమాలు త‌ర్వాత విజ‌య్‌కుమార్ కొండా గ్యాప్ తీసుకున్నాడు.

విడాకులు తీసుకుంటున్న సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్‌...

సూప‌ర్ స్టార్ త‌న‌య సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ 2010లో అశ్విన్‌కుమార్ అనే బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. అయితే కార‌ణాలు తెలియ‌డం లేదు కానీ వీరి మ‌ధ్య విబేదాలు త‌లెత్తాయి.

ఆయ‌న‌కు నేష‌న‌ల్ అవార్డ్ రావాలి - నాగ్

కింగ్ నాగార్జున నేష‌న‌ల్ అవార్డ్ రావాలి అని కోరుకుంటుంది ఎవ‌రికి అనుకుంటున్నారా...? విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కి. స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌కాష్ రాజ్ తాజాగా మ‌న ఊరి రామాయ‌ణం చిత్రాన్ని తెర‌కెక్కించారు.

కింగ్ నాగార్జున చేతుల మీదుగా మ‌న ఊరి రామాయ‌ణం ఆడియో విడుద‌ల‌

జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ రూపొందించిన‌ ద్విభాషా చిత్రం మన ఊరి రామాయణం.  ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృథ్వీ, రఘుబాబు ప్రధాన పాత్ర‌లు పోషించారు.

వైజాగ్ లో ఈనెల 17న డా.మంచు మోహ‌న్ బాబు 40 న‌ట వ‌సంతాల వేడుక‌కు భారీ ఏర్పాట్లు

సాధారణ వ్యక్తిగా తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతి శిఖరాలను అధిరోహించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అభిమాన నటుడయ్యారు. నటజీవితంలో నలభై వసంతాలను పూర్తి చేసుకుని ఈతరం నటులకు ఆదర్శప్రాయంగా నిలిచారు.