జూనియర్ డబుల్ ధమాకా
Send us your feedback to audioarticles@vaarta.com
బీవీయస్ యన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ యూరోప్ లో జరుగుతోంది. ఒన్ నేనొక్కడినే తర్వాత సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. టెంపర్ తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో షార్ప్ గడ్డంతో, వెరైటీ తలకట్టుతో ఎన్టీఆర్ ఫోటోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. న్యూ లుక్ తో ఎన్టీఆర్ లండన్లో షూటింగ్ చేసుకుంటున్నారు.
కానీ తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ చేస్తున్నారట. ఒక లుక్ ని ఇప్పటికే విడుదల చేశారు. మరో లుక్ ను విడుదల చేయాల్సి ఉంది. రెండో లుక్ రఫ్ గా ఉంటుందట. రకుల్ ప్రీత్ సింగ్ నాయికగా నటిస్తోంది. నాన్నకు ప్రేమతో, అభిరామ్ అనే టైటిళ్ళు పరిశీలనలో ఉన్నాయి. వినాయకచవితి పురస్కరించుకుని సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ ఇంతకు ముందు ఆంధ్రావాలా, అదుర్స్ లో డబుల్ యాక్షన్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com