కుమారి 21 ఎఫ్ పై ఎన్టీఆర్ ట్వీట్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
సుకుమార్ దర్శకుడుగా ఒక వైపు ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో..సినిమా చేస్తూనే...మరో వైపు నిర్మాతగా రాజ్ తరుణ్ తో కుమారి 21 ఎఫ్ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. సుకుమార్ పై ఉన్న అభిమానంతో ఎన్టీఆర్ కుమారి 21 ఎఫ్ మూవీ చూసి సినిమా పై ట్వీట్ల వర్షం కురిపించాడు. ట్విట్టర్ లో అప్పుడప్పుడు స్పందించే ఎన్టీఆర్ కుమారి 21 ఎఫ్ మూవీ పై స్పందించడం విశేషం.
కుమారి 21 ఎఫ్ హార్ట్ టచ్చింగ్ స్టోరీ. చాలా బాగుంది. సుకుమార్ రైటింగ్ అద్భుతం అంటూ తెగ పొగిడేస్తున్నాడు. అలాగే హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హేబా పటేల్ బెస్ట్ ఫర్ ఫార్మెన్స్..డైరెక్టర్ సూర్య ప్రతాప్, దేవిశ్రీప్రసాద్, రత్నవేలు..వర్క్ గురించి ప్రత్యేకించి అభినందించాడు యంగ్ టైగర్. కుమారి 21 ఎఫ్ పై ఎన్టీఆర్ ఈ రేంజ్ లో స్పందించడం సినిమాకి చాలా ప్లస్.
మరి...ఎన్టీఆర్ ఇక నుంచి తనకు నచ్చిన ప్రతి సినిమా పై స్పందిస్తాడో...లేక తనకు సంబంధించిన వాళ్ల సినిమాల పైనే స్పందిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com