బాబాయ్ ట్రైలర్ గురించి అబ్బాయ్ ట్వీట్..!
Saturday, December 17, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రాన్ని జాగర్లమూడి క్రిష్ తెరకెక్కించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి థియేట్రికల్ ట్రైలర్ ను కరీంనగర్ తిరుమల థియేటర్ లో అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే....బాబాయ్ బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ గురించి అబ్బాయ్ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు. బాబాయ్ గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ అద్భుతంగా ఉంది అని యంగ్ టైగర్ ట్విట్టర్ లో స్పందించారు. అంతే కాకుండా బాబాయ్ అద్భుతంగా నటించారు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా చూపించినందుకు డైరెక్టర్ క్రిష్ ను అభినందిస్తూ ట్రైలర్ లింక్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు యంగ్ టైగర్.
Phenomenal trailer of #GPS.Babai at his best.Kudos @DirKrish for showcasing NBK like never before https://t.co/jFxzWA7SMy #GPSTrailerStorm
— tarakaram n (@tarak9999) December 16, 2016
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments