తార‌క్ - త్రివిక్ర‌మ్ సినిమా ఎప్పుడంటే?

  • IndiaGlitz, [Friday,August 23 2019]

జూనియ‌ర్ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా ఎప్పుడా అనే ఆస‌క్తి అభిమానుల్లో మొద‌లైంది. కొన్ని కాంబినేష‌న్లు ఎప్పుడూ ఆస‌క్తిని రేకెత్తిస్తుంటాయి. ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అలాంటిదేన‌న్న‌మాట‌.

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌, ఇప్పుడున్న యువ హీరోల్లో డైలాగ్‌ని స్ప‌ష్టంగా చెప్ప‌గ‌లిగిన హీరో ఎన్టీఆర్‌.. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో 'అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌'లోనే చూశాం.
మ‌ళ్లీ అలాంటి మేజిక్ 2020 ఏప్రిల్‌లో మొద‌లుకానుంది. ఈ సినిమాను కూడా హారిక హాసిని క్రియేష‌న్స్ నిర్మిస్తుంద‌ని టాక్‌. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. బ‌ల్గేరియాలో జ‌రిగే షెడ్యూల్‌కి ఎన్టీఆర్ చేరుకుంటారు. ఈ సినిమాను 2020 జూన్‌లో విడుద‌ల చేయాల‌న్న‌ది సంక‌ల్పం. అంటే ఏప్రిల్ నాటికి ఆర్ ఆర్ ఆర్ కి సంబంధించి ఎన్టీఆర్ ప‌నుల‌న్నీ పూర్త‌యిపోతాయి. సో కొత్త లుక్‌కి కూడా చేంజ్ అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉంటాయి.

మ‌రోవైపు త్రివిక్ర‌మ్ ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా 'అల వైకుంఠ‌పురంలో' చిత్రాన్ని చిత్రీక‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం షెడ్యూల్ గ్యాప్‌లో ఉన్న ఈ సినిమా వ‌చ్చే నెల నుంచి అన్న‌పూర్ణ స్టూడియోలో వేసే భారీ హౌస్ సెట్‌లో జ‌రుగుతుంది. ఎలాగూ ఈ సినిమాను 2020 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు కాబ‌ట్టి, త్రివిక్ర‌మ్ జ‌న‌వ‌రి ఆఖ‌రుకంతా ఫ్రీ అయిపోతారు.
సో జ‌న‌వ‌రి ఎండింగ్ నుంచి ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్ వ‌ర‌కూ తార‌క్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ చేస్తే స‌రిపోతుంది.

అద‌న్న‌మాట సంగ‌తి... అలా ఏప్రిల్ 2020 నుంచి ఎన్టీఆర్‌-త్రివిక్ర‌మ్ సినిమా మొద‌ల‌వుతుంది. అనిరుద్ సంగీతం స‌మ‌కూరుస్తార‌ని టాక్‌. ఈ సినిమా త‌ర్వాత 'కేజీఎఫ్‌' డైర‌క్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ సినిమా ఉంటుంది. సో... మూడు సినిమాల వ‌ర‌కు ఎన్టీఆర్‌కు ముందుచూపు ఉంద‌న్న‌మాట‌.