తారక్ , త్రివిక్రమ్ మూవీ డిటైల్స్

  • IndiaGlitz, [Wednesday,February 07 2018]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ తెరకెక్క‌నున్న‌ విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా మొద‌లైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం.. వచ్చే నెల రెండో వారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంద‌ని తెలుస్తోంది. ఓ నవలాధారంగా తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌కు అనిరుధ్‌ స్వరాలను అందిస్తున్నాడు.

ఇప్ప‌టికే కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించిన చిత్ర బృందం.. త్వరలోనే క‌థానాయిక‌ వివరాలు వెల్లడించనుంది. నవలాధారంగా తీసుకున్న కథను త్రివిక్ర‌మ్‌ చాలా పగడ్బందీగా రాసుకున్నారని...అలాగే ఆయ‌న మార్కు కామెడీ, డైలాగ్స్ ఉండబోతున్నాయని స‌మాచారం. జై లవ కుశ' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్నారు. విజ‌య‌ద‌శ‌మికి ఈ చిత్రం విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది.

More News

మ‌ల‌యాళ టైటిల్ చెప్పిన బ‌న్ని

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగులోనే కాదు మలయాళంలో కూడా అభిమానులు ఉన్నారు. అందుకే బన్నీ సినిమాలు మలయాళంలో కూడా అనువదింపబడుతూ ఉంటాయి. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' కూడా మలయాళంలో డబ్ కానుంది.

గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం నా మనసును కలచివేసింది. - డా.మంచు మోహన్ బాబు

తిరుపతిలో చదువుకునే రోజుల్లో నేనూ, ఆయన ఒకే రూమ్ లో  ఉండేవాళ్ళం. ఆయన బ్రదర్ నా క్లాస్ మేట్. నాకు అత్యంత సన్నిహితుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు. ఎలక్షన్స్ టైం లో ఆయన తరపున ఎన్నోసార్లు ప్రచారానికి కూడా వెళ్ళాను.

నితిన్ హీరోయిన్ మారింది

ఇష్క్‌, గుండె జారి గ‌ల్లంత‌య్యిందే వంటి చిత్రాలతో స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చిన నితిన్ 25వ సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత దిల్‌రాజు నిర్మాత‌గా స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌బోయే 'శ్రీనివాస క‌ల్యాణం'లో న‌టించ‌బోతున్నాడు.

గాయ‌త్రి కోసం తొలిసారిగా..

ప‌ద‌హారేళ్లుగా క‌థానాయిక‌గా రాణిస్తోంది ఢిల్లీ డాళ్ శ్రియా శ‌ర‌న్‌. గతేడాది గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చిత్రంలో వ‌శిష్ఠీ దేవిగా అల‌రించిన శ్రియ‌.. ఆ త‌రువాత పైసా వ‌సూల్ చిత్రంలో సంద‌డి చేసింది. ఇక ఈ ఏడాదిలో తొలిగా గాయ‌త్రి చిత్రంతో సంద‌డి చేయ‌నుంది.

తండ్రీకొడుకులు.. భిన్న ఫ‌లితాలు

'మణిశర్మ' ఈ పేరు వింటే చెవుల్లో మెలోడీలు నాట్యమాడుతాయి. ఒకప్పుడు వ‌రుసబెట్టి ఇండస్ట్రీ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ మెలోడీ బ్రహ్మకి గ‌త కొంత‌కాలంగా ఏదీ కలిసిరావడం లేదు. గత సంవత్సరం ఏకంగా 8 సినిమాలకు సంగీతాన్ని అందించినా.. వాటిలో ఒక్క‌టి కూడా సాలిడ్ హిట్ కాలేదు.