ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రంలో ఇద్దరు సీనియర్ హీరోయిన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ‘ఆన్ సైలెంట్ మోడ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఈ నెల 12 నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారని సమాచారం. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు.
సీనియర్ నటుడు జగపతి బాబు ప్రతినాయక పాత్రలో నటించనుండగా.. తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఊపిరి’, ‘ధృవ’, ‘హలో’ వంటి సినిమాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ వినోద్ ఈ చిత్రానికి కూడా పనిచేయనుండడం విశేషం. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఒకప్పటి కథానాయికలు లయ, మీనా ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం. చిత్రంలో నాయకానాయికలకు అమ్మ పాత్రల్లో ఈ నటీమణులు కనిపించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరి కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా.. ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com