ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అప్పుడేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జైలవకుశ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. టాక్ ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. మరికొద్ది రోజుల్లో సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్నది స్పష్టమౌతుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తరువాత ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడనే సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా మార్చిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 25వ చిత్రాన్ని టేకాఫ్ చేస్తున్న త్రివిక్రమ్.. ఆ సినిమా విడుదలయ్యాకే తారక్ సినిమా పనులు ప్రారంభిస్తాడని.. అటుఇటుగా ఈ సినిమా మార్చిలో సెట్స్ పైకి వెళుతుందని ఫిల్మ్నగర్లో చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల తరువాత పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న కొత్త చిత్రం జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments