ఎన్టీఆర్ , త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం లో పూజా హెగ్డే

  • IndiaGlitz, [Monday,March 05 2018]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందాలని ఎంతో కాలం గా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకం గా రూపుదిద్దుకోబోతోంది. #NTR28 చిత్రానికి అందాల భామ పూజా హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేసారు. సంగీతాన్నీ థమన్ అందించగా, ఈ చిత్రానికి ఛాయాగ్రహణం పి. ఎస్. వినోద్ అందిస్తారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రం ను నిర్మించ నున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే ఈ తొలి చిత్రాన్ని తమ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. ఏప్రిల్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. ఈ సంవత్సరం ద్వితీయ భాగం లో చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర వర్గం తెలిపింది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆ..ఆ, వంటి ఘనవిజయం సాధించిన చిత్రాలను నిర్మించిన విషయం విదితమే.

More News

'అనగనగా ఒక ఊళ్ళో' ఆడియో ఆవిష్కరణ

అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో చంద్రబాలాజీ ఫిలిమ్స్ పతాకంపై సాయికృష్ణ కె.వి.ని దర్శకుడిగా పరిచయం చేస్తూ

విజయ్ దేవరకొండతో నాని హీరోయిన్

'కృష్ణగాడి వీర ప్రేమగాధ'వంటి విజయవంతమైన చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ భామ మెహ్రీన్.

30 వసంతాల 'రుద్రవీణ'

'పదుగురి సౌఖ్యాన్ని మించిన పండగ లేదని చాటి చెప్పిన చిత్రం 'రుద్రవీణ'.

బయోపిక్.. దర్శకుడు కూడా బాలయ్యేనా?

మహానటుడు స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం'యన్.టి.ఆర్.’

అల్లరి నరేష్ 55వ చిత్రం ప్రారంభం

కామెడీ కింగ్ అల్లరి నరేష్,టాప్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర కాంబినేషన్ లో