బాబాయ్ బాటలో ఎన్టీఆర్... అలాంటి టైటిల్!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ట్రిపులార్ తర్వాత తదుపరి సినిమాను ట్రాక్ ఎక్కించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ(చినబాబు), నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాకు టైటిల్ ఇదేనంటూ చాలా పేర్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అ.. సెంటిమెంట్‌ను ఫాలో చేస్తూ త్రివిక్రమ్ ‘అయినను పోయి రావలె హస్తినకు..’ అనే టైటిల్‌ను పెట్టాడని ముందుగా వార్తలు వినిపించాయి. రీసెంట్గా ‘రాజా వచ్చినాడు’ అనే టైటిల్ పెట్టారంటూ కూడా న్యూస్ వచ్చింది.
అయితే ఇప్పుడు కొత్త టైటిల్ ఇదేనంటూ కొత్త పేరు వినిపిస్తుంది. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఈ చిత్రానికి చౌడప్పనాయుడు అనే టైటిల్ పరిశీలనలో ఉందని అంటున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే కథాంశంతో సినిమా రూపొందనుందని టాక్. అందుకనే రొటీన్‌కు భిన్నంగా ఈసారి త్రివిక్రమ్ ఈ టైటిల్‌ను అకుంటున్నట్లు టాక్. గతంలో బాలకృష్ణ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన సమరసింహారెడ్డి,నరసింహనాయుడు సినిమాల స్టైల్లో ఎన్టీఆర్ తన సినిమాకు టైటిల్‌ను పెట్టుకున్నాడని అనుకుంటున్నారు కొందరు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments