బాబాయ్ బాట‌లో ఎన్టీఆర్‌... అలాంటి టైటిల్‌!

  • IndiaGlitz, [Monday,January 11 2021]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ట్రిపులార్ త‌ర్వాత త‌దుప‌రి సినిమాను ట్రాక్ ఎక్కించ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. త్రివిక్ర‌మ్ దర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు), నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ నిర్మించ‌నున్న సంగ‌తి తెలిసిందే. కాగా.. ఈ సినిమాకు టైటిల్ ఇదేనంటూ చాలా పేర్లు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అ.. సెంటిమెంట్‌ను ఫాలో చేస్తూ త్రివిక్ర‌మ్ ‘అయిన‌ను పోయి రావ‌లె హ‌స్తిన‌కు..’ అనే టైటిల్‌ను పెట్టాడని ముందుగా వార్త‌లు వినిపించాయి. రీసెంట్‌గా ‘రాజా వచ్చినాడు’ అనే టైటిల్ పెట్టారంటూ కూడా న్యూస్ వ‌చ్చింది.

అయితే ఇప్పుడు కొత్త టైటిల్ ఇదేనంటూ కొత్త పేరు వినిపిస్తుంది. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ఈ చిత్రానికి చౌడ‌ప్ప‌నాయుడు అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని అంటున్నారు. ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే క‌థాంశంతో సినిమా రూపొందనుంద‌ని టాక్‌. అందుక‌నే రొటీన్‌కు భిన్నంగా ఈసారి త్రివిక్ర‌మ్ ఈ టైటిల్‌ను అకుంటున్న‌ట్లు టాక్. గ‌తంలో బాల‌కృష్ణ ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన స‌మ‌ర‌సింహారెడ్డి,న‌ర‌సింహనాయుడు సినిమాల స్టైల్లో ఎన్టీఆర్ త‌న సినిమాకు టైటిల్‌ను పెట్టుకున్నాడ‌ని అనుకుంటున్నారు కొంద‌రు.

More News

సత్తా చాటిన రైతులు.. ఏకంగా సీఎం హెలీప్యాడ్‌నే...

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కి అక్కడి రైతులు తమ సత్తా ఏంటో చూపించారు. పోలీసుల ఫిరంగులు, బాష్పవాయువును సైతం లెక్కచేయలేదు.

ఏపీలో కొత్త జిల్లాలకు రంగం సిద్ధం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే దీనిపై అధికారుల కమిటీ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందినట్టు సమాచారం.

పాక్‌లో కల్లోలం.. ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పవర్ కట్..

పాకిస్థాన్‌లో ఒక్కసారిగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇది కేవలం ఒక్క ఏరియాకు పరిమితమైతే పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు కానీ దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పవర్ కట్ అయింది.

ఆకట్టుకుంటున్న‘లవ్ స్టోరీ’ టీజర్.. అంచనాలను భారీగా పెంచేశారు..

అందమైన లవ్ స్టోరీలను మరింత అందంగా సున్నితమైన భావోద్వేగాలను జత చేసి అందించడంలో దిట్ట శేఖర్ కమ్ముల.

అంరంగ వైభవంగా సింగర్ సునీత వివాహం..

ప్రముఖ గాయని సునీత వివాహం మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేనితో అంగరంగ వైభవంగా జరిగింది.