బాలీవుడ్ డైరెక్టర్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
మన టాలీవుడ్ హీరోలు మార్కెట్ క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తర్వలోనే రాజమౌళి తారక్, చరణ్‌లను పాన్ ఇండియా స్టార్స్‌గా మారుస్తున్నారు. ఇప్పుడు వీరిలో తారక్ తన తదుపరి సినిమాలను పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేసుకుంటున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో చరణ్‌తో కలిసి చేస్తున్న చిత్రం ఎలాగూ పాన్ ఇండియా సినిమా కాబట్టి.. తదుపరి త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్లోనే ప్లాన్ చేస్తున్నాడు.
కాగా ఈ రెండు సినిమాలు విడుదల కాకుండానే ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని టాక్ వినపడుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం మేరకు ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ ఓ బాలీవుడ్ సినిమాను తారక్‌తో తెరకెక్కించాలనుకుంటన్నాడట. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ విలన్‌గా నటిస్తాడని అంటున్నారు. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా పూర్తయిన తర్వాతే తారక్ తన 31వ సినిమాపై ఫోకస్ పెడతాడట. ఈ సినిమా చారిత్రాత్మక చిత్రంగానే తెరకెక్కే అవకాశాలున్నాయని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com