బాలీవుడ్ డైరెక్టర్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్

  • IndiaGlitz, [Saturday,May 02 2020]

మన టాలీవుడ్ హీరోలు మార్కెట్ క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తర్వలోనే రాజమౌళి తారక్, చరణ్‌ల‌ను పాన్ ఇండియా స్టార్స్‌గా మారుస్తున్నారు. ఇప్పుడు వీరిలో తార‌క్ త‌న త‌దుప‌రి సినిమాల‌ను పాన్ ఇండియా లెవ‌ల్లో ప్లాన్ చేసుకుంటున్నాడు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్‌తో క‌లిసి చేస్తున్న చిత్రం ఎలాగూ పాన్ ఇండియా సినిమా కాబ‌ట్టి.. త‌దుప‌రి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోయే సినిమాను కూడా పాన్ ఇండియా లెవ‌ల్లోనే ప్లాన్ చేస్తున్నాడు.

కాగా ఈ రెండు సినిమాలు విడుద‌ల కాకుండానే ఎన్టీఆర్ మ‌రో పాన్ ఇండియా చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడ‌ని టాక్ విన‌ప‌డుతోంది. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న స‌మాచారం మేర‌కు ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత సంజ‌య్ లీలా బ‌న్సాలీ ఓ బాలీవుడ్ సినిమాను తార‌క్‌తో తెర‌కెక్కించాల‌నుకుంట‌న్నాడ‌ట‌. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ర‌ణ్వీర్ సింగ్ విల‌న్‌గా న‌టిస్తాడ‌ని అంటున్నారు. అయితే త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా పూర్త‌యిన త‌ర్వాతే తార‌క్ త‌న 31వ సినిమాపై ఫోక‌స్ పెడ‌తాడ‌ట‌. ఈ సినిమా చారిత్రాత్మ‌క చిత్రంగానే తెర‌కెక్కే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

మ‌హేశ్ సినిమాలో వింకీ బ్యూటీ..?

ఓ చిన్న క‌న్నుగీట‌తో రాత్రికి రాత్రే నేష‌న‌ల్ ఫేమస్ అయ్యింది మ‌ల‌యాళ కుట్టి ప్రియా వారియ‌ర్‌. ఈమె న‌టించిన ల‌వర్స్‌డే సినిమా ప్లాప్ అయ్యింది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు

వ‌రుణ్‌తేజ్‌ బ్యూటీతో బ‌న్నీ స్పెష‌ల్ సాంగ్..?

వ‌రుణ్ తేజ్‌తో ‘లోఫ‌ర్’ చిత్రంలో న‌టించిన బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీ గుర్తుందిగా! ఎలా మ‌ర‌చిపోతారు. బాలీవుడ్‌లో త‌న హాటు అందాల‌తో సెగ‌లు రేపుతుందీ అమ్మ‌డు.

నాన్న‌మ్మ ద‌గ్గ‌ర రెసిపీ నేర్చుకుంటోన్న చ‌ర‌ణ్‌

లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు సినీ సెల‌బ్రిటీలు. టాలీవుడ్ విష‌యానికి వ‌స్తే సెల‌బ్రిటీలంద‌రూ బీ ద రియ‌ల్ మేన్ ఛాలెంజ్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.

లాక్‌‌డౌన్‌లో లిక్కర్‌ అమ్మకాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం తాజాగా మరోసారి పొడిగించింది. ఈ 3.0 లాక్‌డౌన్‌ రెండు వారాల పాటు అనగా మే-17 వరకు కొనసాగనుంది.

లింగంపల్లి నుంచి వలస కార్మికులతో ఝార్ఖండ్‌‌కు తొలిరైలు!

దేశ వ్యాప్తంగా ఉన్న వలస కార్మికులను వారి స్వగృహాలకు పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ క్రమంలో తెలంగాణలోని లింగంపల్లి స్టేషన్ నుంచి ఝార్ఖండ్‌లోని హతియా స్టేషన్‌కి 1,230 మంది