24 డైరెక్టర్ తో ఎన్టీఆర్ ?

  • IndiaGlitz, [Wednesday,October 18 2017]

ఇటీవ‌లే జైల‌వ‌కుశ‌లో త్రిపాత్రాభిన‌యం చేసి మెప్పించాడు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌. ఇక మ‌నం డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ కూడా త‌న గ‌త చిత్రం 24లో సూర్య‌ని మూడు పాత్ర‌ల్లో చూపించి మంచి మార్కులు కొట్టేశాడు. అలాంటి ఎన్టీఆర్‌, విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

విక్ర‌మ్ ప్ర‌స్తుతం అక్కినేని అఖిల్‌తో హ‌లో అనే సినిమా చేస్తున్నాడు. ఆ త‌రువాత అల్లు అర్జున్‌, నానితోనూ సినిమాలు చేసే అవ‌కాశ‌ముంద‌ని ఆ మ‌ధ్య క‌థ‌నాలు వినిపించాయి. ఇప్పుడు తార‌క్‌తోనూ విక్ర‌మ్ కాంబో సెట్ట‌య్యింద‌ని తెలిసింది.

జైల‌వ‌కుశ త‌రువాత ఎన్టీఆర్ సినిమా ఏదీ సెట్స్ పైకి వెళ్లలేదు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తార‌క్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌నున్నాడు. ఆ సినిమా త‌రువాతే విక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మూవీ చేస్తాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్లో చర్చించుకుంటున్నారు.

ఏదేమైనా.. ఈ ఆస‌క్తిక‌ర‌మైన కాంబినేష‌న్ సెట్ కావ‌డానికి మ‌రో ఏడాది కాలం ప‌ట్టొచ్చంటున్నారు.

More News

మహేష్.. మళ్లీ పవన్ డేట్ ?

శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలతో సందడి చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే ఆ రెండు సినిమాలు కూడా ఆశించిన విజయం సాధించలేదు.

'అలా ఎలా' ద‌ర్శ‌కుడితో రాజ్ త‌రుణ్‌

ఉయ్యాల జంపాల చిత్రంతో క‌థానాయ‌కుడిగా తెరంగేట్రం చేశాడు యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్‌. ఆ త‌రువాత సినిమా చూపిస్త మామ‌, కుమారి 21 ఎఫ్ విజ‌యాల‌తో హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు.

'పిఎస్‌వి గ‌రుడవేగ 126.18 ఎం' ట్రైల‌ర్ విడుద‌ల

యాంగ్రీ యంగ్ మేన్‌గా, ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో డా.రాజ‌శేఖ‌ర్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా రూపొందిన చిత్రం 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం'.

నిరుద్యోగం వ‌ల్లే సినిమాల్లోకి వ‌చ్చా.. సాయిధ‌ర‌మ్‌

నిరుద్యోగం వ‌ల్లే సినిమాల్లోకి వ‌చ్చా. వేరే అవ‌కాశం లేక‌పోవ‌డం వ‌ల్లే సినిమా ప‌రిశ్ర‌మ‌ని ఎంచుకున్నానంటూ సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

రాజా ది గ్రేట్ క‌థ ఇదే..

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ తొలిసారిగా అంధుడి పాత్ర‌లో న‌టించిన చిత్రం రాజా ది గ్రేట్‌. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు (బుధ‌వారం) తెర‌పైకి రానుంది.