24 డైరెక్టర్ తో ఎన్టీఆర్ ?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవలే జైలవకుశలో త్రిపాత్రాభినయం చేసి మెప్పించాడు యంగ్‌టైగర్ ఎన్టీఆర్. ఇక మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ కూడా తన గత చిత్రం 24లో సూర్యని మూడు పాత్రల్లో చూపించి మంచి మార్కులు కొట్టేశాడు. అలాంటి ఎన్టీఆర్, విక్రమ్ కుమార్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
విక్రమ్ ప్రస్తుతం అక్కినేని అఖిల్‌తో హలో అనే సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత అల్లు అర్జున్, నానితోనూ సినిమాలు చేసే అవకాశముందని ఆ మధ్య కథనాలు వినిపించాయి. ఇప్పుడు తారక్‌తోనూ విక్రమ్ కాంబో సెట్టయ్యిందని తెలిసింది.
జైలవకుశ తరువాత ఎన్టీఆర్ సినిమా ఏదీ సెట్స్ పైకి వెళ్లలేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తారక్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. ఆ సినిమా తరువాతే విక్రమ్ కాంబినేషన్లో మూవీ చేస్తాడని ఫిల్మ్‌నగర్‌లో చర్చించుకుంటున్నారు.
ఏదేమైనా.. ఈ ఆసక్తికరమైన కాంబినేషన్ సెట్ కావడానికి మరో ఏడాది కాలం పట్టొచ్చంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments