రాజమౌళి సినిమా కోసం ఎన్టీఆర్ కొత్త లుక్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుందీ చిత్రం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ న్యూలుక్‌లో కనిపించనున్నారు. ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో కసరత్తులు చేసి డైట్‌ను ఫాలో అయిన ఎన్టీఆర్.. ఇప్పుడు కొత్త లుక్‌తో దర్శనమిస్తూ ఆకట్టుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో.. ఎన్టీఆర్ తన తదుపరి చిత్రంలో కూడా మరో లుక్‌తో దర్శనమివ్వబోతున్నారని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న మల్టీస్టారర్ మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ కోసం కూడా ఎన్టీఆర్ మరో కొత్త లుక్ కోసం ప్రయత్నిస్తున్నారట. ఈ సినిమా కోసం కూడా లాయిడ్ స్టీవెన్స్.. ఎన్టీఆర్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పని చేయనున్నారని సమాచారం. రామ్ చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం.. 2020లో విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com