రాజమౌళి సినిమా కోసం ఎన్టీఆర్ కొత్త లుక్

  • IndiaGlitz, [Wednesday,May 02 2018]

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుందీ చిత్రం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ న్యూలుక్‌లో కనిపించనున్నారు. ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో కసరత్తులు చేసి డైట్‌ను ఫాలో అయిన‌ ఎన్టీఆర్.. ఇప్పుడు కొత్త లుక్‌తో ద‌ర్శ‌న‌మిస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో.. ఎన్టీఆర్ తన తదుపరి చిత్రంలో  కూడా మరో లుక్‌తో దర్శనమివ్వబోతున్నారని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న మల్టీస్టారర్ మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ కోసం కూడా ఎన్టీఆర్ మరో కొత్త లుక్‌ కోసం ప్రయత్నిస్తున్నారట. ఈ సినిమా కోసం కూడా లాయిడ్ స్టీవెన్స్.. ఎన్టీఆర్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పని చేయనున్నారని సమాచారం. రామ్ చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం.. 2020లో విడుదల కానుంది. 

More News

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న 'సాహో'

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న మూవీ ‘సాహో’.

షూటింగ్‌ పూర్తి చేసుకున్న భారీ గ్రాఫిక్‌ చిత్రం 'భద్రకాళి'

ఆర్‌. పిక్చర్స్‌ పతాకంపై బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో సీనియర్‌ నటి సీత టైటిల్‌ పాత్రలో యువ నిర్మాత చిక్కవరపు రాంబాబు అత్యంత భారీ గ్రాఫిక్స్‌తో  రూపొందిస్తున్న చిత్రం 'భద్రకాళి'.

సమ్మోహనం​ టీజర్ చూస్తుంటే స్ట్రాంగ్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది - మెగాస్టార్ చిరంజీవి

"సమ్మోహనం" సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు మెగాస్టార్ చిరంజీవి. సుధీర్ బాబు, అదితి రావు హైదరి జంటగా

సూర్య - మిర్యాల రవీందర్ రెడ్డిల సంయుక్త నిర్మాణంలో కార్తీ 'చినబాబు'

తమిళ, తెలుగు భాషల్లో సమానమైన క్రేజ్ అండ్ స్టార్ డమ్ కలిగిన సూర్య, కార్తీ బ్రదర్స్ కాంబినేషన్ లో

వి.వి.వినాయ‌క్ చేతుల మీదుగా 'శంభో శంక‌ర' తొలి లిరిక‌ల్ సాంగ్ ఆవిష్క‌ర‌ణ‌

శంక‌ర్ హీరోగా శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌క‌త్వంలో ఎస్. కె. పిక్చ‌ర్స్ సమ‌ర్ప‌ణ‌లో ఆర్.ఆర్ . పిక్చ‌ర్స్ సంస్థ  నిర్మిస్తోన్న