ఇటలీకి ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం 'అరవింద సమేత'. పూజా హెగ్డే మెయిన్ లీడ్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా కీలక పాత్రలో నటిస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో ఓ సాంగ్ చిత్రీకరణ మిగిలి ఉందట.
కాబట్టి త్వరలోనే యూనిట్‌లోని కీలక సభ్యులు మిలాన్‌కు వెళ్లి ఈ పాటను చిత్రీకరించుకుని వస్తారట. ఇప్పటికే ఈ సినిమా పాటలు మార్కెట్లోకి విడుదలైయ్యాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments