ఎన్టీఆర్ పక్కన అమైరా

  • IndiaGlitz, [Sunday,October 25 2015]

ఎన్టీఆర్ ప్రస్తుతం నాన్నకు ప్రేమకు టీజర్ ఇచ్చిన కిక్ ను ఆస్వాదిస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా ఆదివారం మరో సినిమా ప్రారంభం కానుంది. శ్రీమంతుడులాంటి ఫ్రెష్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చిన మైత్రీ మూవీస్ రూపొందించే సినిమాలో ఎన్టీఆర్ కథానాయకుడిగా చేస్తున్నారు. హ్యాట్రిక్ హిట్ కొట్టి తీరాలనే కసితో కొరటాల శివ పనిచేస్తున్నారు.

ఈ సినిమా పూజా కార్యక్రమాలు మాత్రం ఆదివారం లాంఛనంగా జరగనున్నాయి. సినిమా షూటింగ్ మొదలు కావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఈ సినిమాలో అమైరా దస్తూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేయనున్నట్టు సమాచారం. అమైరా దస్తూర్ మనకు ధనుష్ సినిమా అనేకుడు ద్వారా పరిచయమయే.