సంచలనం: ఎన్టీఆర్ చేతికి టీడీపీ పగ్గాలు.. ఆయనే సీఎం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో పూర్తిగా గాలిపోయిన ‘సైకిల్’కు పంచర్లు వేసి నడిపేందుకు అధిష్టానం సిద్ధమైందా..? ఆ సైకిల్‌పై చంద్రబాబు అయితే కుదరదని నందమూరి తారకరామారావును రంగంలో దించాలనుకుంటున్నారా..? తెలంగాణ టీడీపీ పగ్గాలు పూర్తిగా జూనియర్‌కు అప్పగించాలని అధినేత భావిస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని ఓ ఎమ్మెల్యే మాటలను బట్టి చూస్తే అర్థమవుతోంది. అసలు ఆ ఎమ్మెల్యే ఎవరు..? ఆయన ఏం చెప్పారు..? నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ పగ్గాలు చేపడుతారా..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
2014 ఎన్నికల తర్వాత దాదాపు తుడుచిపెట్టుకుపోయిన పార్టీ తెలుగుదేశం. ముఖ్యంగా ఎప్పుడు తెలంగాణ ఆశాదీపంగా భావించిన రేవంత్ రెడ్డి సైకిల్ దిగి హస్తం గూటికి చేరిపోయారో అప్పుడిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆయన పార్టీ మారిన తర్వాత కీలకనేతలంతా క్యూ కట్టడంతో తెలంగాణ సై‘కిల్’ అయ్యింది. అయితే 2018 ముందస్తు ఎన్నికల్లో టీడీపీ,కాంగ్రెస్‌తో పాటు మరికొన్ని పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీచేసినప్పటికీ అధికారం దక్కించుకోలేకపోయింది.
ఒకప్పుడు అధికారాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ.. 2018 లో మాత్రం సింగిల్ డిజిట్ అనగా కేవలం రెండంటే రెండే స్థానాకలు పరిమితం కావడం గమనార్హం. వారిలో ఒకరు మచ్చ నాగేశ్వరరావు.. మరొకరు సండ్ర వెంకట వీరయ్యలు. అయితే ఇప్పటికే సండ్ర సైకిల్ దిగి కారెక్కేందుకు సిద్ధమయ్యారు.. పార్టీకి రాజీనామా చేసేశారు కూడా మంచి రోజు చూసుకొని కేసీఆర్ సమక్షంలో కారెక్కడమే తరువాయి. ఇక మిగిలింది వన్ అండ్ ఓన్లీ మచ్చ నాగేశ్వరరావు మాత్రమే. ఉన్నది నేనొక్కడినే అయినా ప్రభుత్వంపై పోరాడతాను కానీ పార్టీ మారే ప్రసక్తే లేదని టీడీపీలో తిష్టవేసి కూర్చున్నారు. అంతటితో ఆగని ఆయన పార్టీ మారుతున్నట్లు వచ్చిన రూమర్స్‌ను ఖండించి ఉన్నట్లు ఉండి కొత్త విషయాలు మీడియాకు వెల్లడించారు.
ఆయన మాటల్లోనే...
"రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుంది. రెండేళ్లలో టీడీపీని బతికించుకుంటాం. ఆ తర్వాత డైమండ్ లాంటి లీడర్ వస్తారు. జూనియర్ ఎన్టీఆర్ రెండేళ్ల తర్వాత రాజకీయాల్లోకి వస్తానని చంద్రబాబుకు చెప్పారట. తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి కూడా అవుతాడు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రంపై చంద్రబాబు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. కేడర్‌ను ధైర్యంగా ఉండమని చెప్పారు" అని మచ్చా తన మనసులోని మాటను బయటపెట్టారు.
నేను రెడీ అంటున్న ఎన్టీఆర్..!
"పార్టీకి నా సేవలు అవసరమైనప్పుడు కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను. నా ప్రాణం ఉన్నంత వరకూ టీడీపీలోనే ఉంటాను. ఫలానా టైమ్‌లో నా సేవలు పార్టీకి కావాలని ఒక్క పిలుపు వస్తే చాలు రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉంటాను. ఎన్టీఆర్ మనవడిగా నేను ఆయన ఆశయాలను.. ఆయన్ను ఈ జనరేషన్‌కు గుర్తు చేయడం నా బాధ్యత. తెలుగుదేశం బతికున్నంత కాలం నేను పార్టీతోనే ఉంటాను" అని గతంలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో ఎన్టీఆర్ అవసరం ఉంది గనుక.. ఆయన రాజకీయాల్లోకి వచ్చి పగ్గాలు చేపట్టి .. చలనం లేని సైకిల్‌ను లేపుతారా..? లేకుంటే నాకెందుకు ఇవన్నీ అని సినిమాలకే పరిమితమవుతారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout