ఎన్టీఆర్ హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’.. ప్రకటన వచ్చేసింది
Send us your feedback to audioarticles@vaarta.com
'బిగ్‌బాస్’ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. బిగ్‌బాస్ సీజన్ 1తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. తొలిసారిగా బుల్లితెరపై అడుగుపెట్టినప్పటికీ అదరగొట్టేశాడు. హోస్ట్ అంటే ఇలాగే ఉండాలి అన్నట్టుగా ఓ ట్రెండ్ సెట్ చేశాడు. ఆ తరువాత మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు. బిగ్‌బాస్ సీజన్ 4 కూడా పూర్తైంది. ప్రతి సీజన్ సమయంలోనూ ఎన్టీఆర్ హోస్ట్‌గా వస్తే బాగుండని ఆయన అభిమానులే కాదు.. బిగ్‌బాస్ ప్రేక్షకులంతా కోరుకున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం తిరిగిన టెలివిజన్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఇన్నాళ్లకు తిరిగి బుల్లితెర ప్రేక్షకుల కోరిక తీరబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ ప్రముఖ ఛానల్లో కనిపించబోతున్నాడు.
ఇప్పటికే దీనికి సంబంధించిన వార్తలొచ్చినప్పటికీ అయితే కార్యక్రమం ఏంటనేది మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. కానీ తాజాగా క్లారిటీ వచ్చేసింది. జెమిని ఛానల్ ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ‘‘ఎవరు మీలో కోటీశ్వరులు మీ జీవితాలని మార్చే గేమ్ షో , మీ ఆశలని నిజం చేసే గేమ్ షో "ఎవరు మీలో కోటీశ్వరులు " త్వరలో మీ జెమినీ టీవీ లో రాబోతుంది సిద్ధంగా ఉండండి’’ అని సదరు జెమిని టీవీ యాజమాన్యం విడుదల చేసింది. ఈ కార్యక్రమానికే ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. కాగా.. దీనికి సంబంధించిన ప్రోమోను ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
The Biggest and Most Entertaining show, #EvaruMeeloKoteeswarulu is coming soon to your favorite Gemini TV.
— Gemini TV (@GeminiTV) March 7, 2021
"Evaru Meelo Koteeswarulu " can make your dreams come true. Watch this space for more details. Coming soon #GeminiTV #EvaruMeeloKoteeswaruluonGeminiTV #EMKonGeminiTV pic.twitter.com/WoX8XhVHjc
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com