ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగు టీవీ చరిత్ర లో నే అతి పెద్ద షో 'బిగ్ బాస్' ను ప్రారంభించనున్న స్టార్ మా
Send us your feedback to audioarticles@vaarta.com
"సరికొత్త ఉత్తేజం" అనే నినాదం తో తెలుగు ప్రేక్షకులకు ఎల్లప్పుడూ కొత్తదనాన్ని అందించాలని భావించే ఛానల్ స్టార్ మా. ఈ సంకల్పం తో నే తెలుగు టీవీ చరిత్ర లో నే అతి పెద్ద షో, "బిగ్ బాస్", ను ప్రేక్షకుల కోసం సిద్ధం చేస్తోంది స్టార్ మా. నటన కి స్టార్ ఇమేజ్ మారు పేరు అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని మొట్ట మొదటి సారి గా బుల్లి తెర మీదకి తీసుకువస్తోంది "బిగ్ బిన్" షో.
ఒక యువ తరం అగ్ర కథానాయకుడు బుల్లి తెర పై ఇంత పెద్ద షో ను హోస్ట్ చేయటం బహుశా దక్షిణ భారతం ఈ మధ్య కాలం లో ఇదే ప్రధమం. ప్రపంచవ్యాప్తం గా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ బిగ్ బాస్ షో ఎండెమోల్ సంస్థ కు చెందిన ది. హిందీ లో సల్మాన్ ఖాన్ తో ఇప్పటికే పది సీజన్ లు విజయవంతం గా పూర్తి చేసుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందు కు ఈ షో ను ఎన్టీఆర్ తీసుకువస్తారు.
ప్రత్యేకం గా నిర్మించిన ఒక ఇంట్లో, సుమారు డజను మంది సెలబ్రిటీ లను పెట్టి తాళం వేస్తారు. వారికి కావాల్సిన అన్ని వసతులను కల్పిస్తారు. కానీ బయట ప్రపంచం తో కానీ, సెల్ ఫోన్ లు టీవీ లు, పేపర్ లు వంటి మాధ్యమాల తో కానీ వారికి సంబంధం ఉండదు. ఆ ఇల్లే వారి ప్రపంచం. వారి ప్రతి కదలికను కెమెరా లు రికార్డు చేస్తూనే ఉంటాయి. వీరి జీవన శైలి ని ప్రేక్షకులు గమనిస్తూ ఉంటారు. ఒకరి తో ఒకరికి సంబంధం లేని వాళ్ళు బయట ప్రపంచం తో సంబంధం లేని ఒక ఇంట్లో ఎలా ఉండగలుగుతారు అనేది ఆశక్తికరమైన అంశం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, "టీవీ అనేది ఏంతో ప్రాముఖ్యత కలిగిన ఎంటర్టైన్మెంట్ మాధ్యమం. తెలుగు టీవీ చరిత్ర లో నే అతి పెద్ద షో గా రూపొందుతోన్న "బిగ్ బాస్" ను హోస్ట్ చేయమని స్టార్ మా వారు నన్ను సంప్రదించినప్పుడు, చాలా ఆశక్తి కరం గా అనిపించింది. ఈ షో తప్పకుండా ఒక గేమ్ చేంజర్ అవుతుంది" అన్నారు.
స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ మాట్లాడుతూ, " తెలుగు లో అత్యంత భారీ స్థాయి లో ఈ బిగ్ బాస్ షో ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రారంభించటం మాకు ఎంతో సంతోషం గా ఉంది. తెలుగు టీవీ ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి సాంకేతిక విలువలను, ఎంటర్టైన్మెంట్ ను అందించటమే స్టార్ మా లక్ష్యం. ఇందుకు బిగ్ బాస్ షో ఎంతగానో దోహద పడుతుంది. తెలుగు ప్రజల మనోభావాలను, విలువలను దృష్టి లో ఉంచుకుని, ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండే లా ఈ షో ఉంటుంది. గత కొద్ది కాలం గా స్టార్ మా ప్రోగ్రామింగ్ స్ట్రాటజీ లో చాలా మార్పులు జరుగుతూ వస్తున్నాయి. కొత్త షో లు కొత్త ప్రోగ్రాం ల తో మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ అయ్యే దిశ గా స్టార్ మా అడుగులు వేస్తోంది" అని అన్నారు.
స్టార్ టీవీ నెట్వర్క్ లో ఒక భాగం అయిన స్టార్ మా గ్లోబల్ కంపెనీ 21స్ట్ సెంచరీ ఫాక్స్ లో ఒక భాగం. స్టార్ మా , స్టార్ మా HD , మా మ్యూజిక్, మా మూవీస్ మరియు మా గోల్డ్ ఈ స్టార్ మా నెట్వర్క్ లో ఉన్న అయిదు ఛానళ్ళు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments