చిరు, బాలయ్య ఇవ్వలేనిది తారక్ ఇస్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ తరంలో ఎలాంటి పాత్రనైనా చేయగల కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న తారక్.. జైలవకుశ కోసం తొలిసారిగా త్రిపాత్రాభినయం చేయడమే కాకుండా ప్రతినాయకుడుగానూ దర్శమివ్వనున్నాడు. ఈ మూడు పాత్రలు వేటికవే భిన్నంగా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.
ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో ఇలా మూడు పాత్రల్లో అగ్ర కథానాయకులు కనిపించిన సందర్భాలు అరుదనే చెప్పాలి. అప్పుడెప్పుడో ముగ్గురు మొనగాళ్లు కోసం చిరంజీవి అన్నదమ్ముల పాత్రల కోసం త్రిపాత్రాభినయం చేస్తే.. 5 ఏళ్ల క్రితం అధినాయకుడు కోసం బాలకృష్ణ ఒకే కుటుంబంలోని మూడు తరాల పాత్రలు చేశాడు. అయితే పై రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. మరి చిరు, బాలయ్య త్రిపాత్రాభినయం పరంగా ఇవ్వలేని కమర్షియల్ విజయాన్ని తారక్ ఇవ్వగలడో లేదో మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com