'శ్రీనివాస కళ్యాణం' చేయనున్న ఎన్టీఆర్?
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన కొత్త చిత్రం 'జైలవకుశ' ఈ నెల 21న విడుదలకు సిద్ధమైంది. ఆ తరువాత.. ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తారక్ చేయనున్న చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు? ఈ ప్రశ్నకి సమాధానంగా.. దిల్ రాజు నిర్మించే చిత్రం అని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
'శ్రీనివాస కళ్యాణం' పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిసింది. గతంలో దిల్ రాజు నిర్మాణంలో 'బృందావనం', 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాలు చేశారు తారక్. ముచ్చటగా మూడో సారి 'శ్రీనివాస కళ్యాణం' చేయనున్నారు. పాత టైటిల్ 'బృందావనం'ని మరోసారి వాడి హిట్ కొట్టిన ఎన్టీఆర్, దిల్ రాజు ల కాంబినేషన్.. 30 ఏళ్ల క్రితం వచ్చిన వెంకటేష్ హిట్ చిత్రం 'శ్రీనివాస కళ్యాణం'తో మరోసారి ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com