ఎన్టీఆర్ టైటిల్ ఫిక్స్ అయింది...

  • IndiaGlitz, [Wednesday,September 16 2015]

టెంపర్' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం సినిమా లండన్ లో చిత్రీకరణ జరుగుతుంది. శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసి సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

అయితే అంతకంటే ముందుగా అభిమానుల కోసం ఎన్టీఆర్ దసరా కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను అక్టోబర్ 17న దసరా కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారకంగా ప్రకటించింది. చిత్ర నిర్మాణంలో రిలయన్స్ సంస్థ కూడా పార్టనర్ అయింది. ఈ సినిమాకి నాన్నకి ప్రేమతో' అనే టైటిల్ ను ఫిక్స్ చేసేశారు. గతంలో నాన్నకు ప్రేమతో టైటిల్ తో పాటు అభిరామ్ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే చిత్రయూనిట్ నాన్నకు ప్రేమతో' టైటిల్ వైపే మొగ్గు చూపినట్టు సమాచారం.