తండ్రి హోదాలో వచ్చిన బాబాయ్‌కి ధన్యవాదాలు - తారక్
Send us your feedback to audioarticles@vaarta.com
```అరవిందస సమేత వీరరాఘవ` ప్రయత్నాన్ని ఆశీర్వదించిన అభిమాన సోదరులకు వందనాలు. చేసిన ప్రయత్నాన్ని ఎంతో శ్రద్ధతో, ఎంతో నమ్మకంతో ఎంతో జాగ్రత్తతో ఆశీర్వదించారు. త్రివిక్రమ్‌గారు నా ఆప్తుడు, మిత్రుడు, శ్రేయోభిలాషి. త్రివిక్రమ్ మీద నమ్మకాన్ని ప్రేక్షకులు ఇలా చూపించారు`` అన్నారు ఎన్టీఆర్ అరవింద సమేత సక్సెస్ మీట్‌కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ ఇంకా మాట్లాడుతూ ``ఈ విజయదశమికి నల్లమబ్బు కమ్మిన విషాద చాయల్లో ఉన్న మా కుటుంబంలోకి కొత్త వెలుగు తెచ్చినందుకు థాంక్యూ. జీవితాంతం గుర్తుండిపోయే సినిమాను ఇచ్చారు.
మా ఇద్దరి కలను వెనుక కూర్చుని వాళ్ల భుజాలపై తీసుకెళ్లిన ప్రతి సాంకేతిక నిపుణులు, ప్రతి నటుడు, ప్రతి నటికీ చేతులు జోడించి నా హృదయపూర్వక పాదాభివందనం. మా పల్లకీని మోసింది సాంకేతిక నిపుణులు. వాళ్ల కృషి వల్లనే ఈ సినిమా ఇంతబాగా వచ్చింది. ఈ ఆనందాన్ని కేవలం అభిమానులతోనే కాదు, మా బాబాయ్తోనూ పంచుకుందాం అని అనుకున్నాం. మా నాన్న ఇక్కడే ఎక్కడో తిష్ట వేసుకుని చూస్తూ ఉండి ఉంటారు. ఈ రోజు జరిగే ఈ ఘట్టాన్ని. తండ్రి హోదాలో మా నాన్నగారి హోదాలో ఇక్కడికి వచ్చిన బాబాయ్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com