కత్తి కంటే కలం ఎంత గొప్పదో నిరూపించే సినిమా ఇజం - ఎన్టీఆర్
Wednesday, October 5, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
డేరింగ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతున్నపవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇజం. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మించారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన అదితి ఆర్య నటించింది. కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ జర్నలిస్ట్ గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. అనూప్ మ్యూజిక్ అందించిన ఇజం ఆడియో రిలీజ్ కార్యక్రమం సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో హైదరాబాద్ దసపల్లా హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన నందమూరి హరికృష్ణ ఇజం బిగ్ సీడీను, ఆడియో సీడీను ఆవిష్కరించి తొలి సీడీను యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అందచేసారు.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ... పూరి సార్ ఎల్లప్పుడు టెక్నిషియన్స్ ను బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. పూరి సార్ తో నాకిది మూడవ సినిమా. ఎన్టీఆర్ గారితో టెంపర్ తర్వాత కళ్యాణ్ రామ్ గారితో ఇజం సినిమాకి నేను మ్యూజిక్ అందించడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉదయమే ఇజం సాంగ్స్ రిలీజ్ చేసాం. ఈ సాంగ్స్ కి వెరీ గుడ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ పాటలకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ పంపించిన వారందరికీ థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. హరికృష్ణ గారు, ఎన్టీఆర్ గారు చేతుల మీదుగా ఆడియో రిలీజ్ కావడం ఆనందంగా ఉంది. నా టీమ్ అందరికీ థ్యాంక్స్. హీరో కళ్యాణ్ గారితో నాకిది ఫస్ట్ ఫిల్మ్. ఇజం సక్సెస్ ఫుల్ మూవీగా నిలవాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.... నా సన్నిహితుడు పూరి జగన్నాథ్ సినిమా ఫంక్షన్ కి రావడం ఆనందంగా ఉంది. అనూప్ మ్యూజిక్ అంటే నాకు బాగా ఇష్టం. అనూప్ మ్యూజిక్ రాజా గార్ని గుర్తుచేస్తుంది. మనం సినిమాకి అనూప్ అద్భుతమైన రీ రికార్డింగ్ అందించాడు. మనం సినిమాలో అనూప్ అందించిన రీ రికార్డింగ్ చూస్తుంటే కథను చూడాలని మన చేయిని పట్టుకుని ముందుకు తీసుకెళ్లినట్టు అనిపిస్తుంది. ఇక కళ్యాణ్ గురించి చెప్పాలంటే...ఈ ట్రైలర్ లో కళ్యాణ్ ఆకలి తెలుస్తుంది. పూరి కంటూ ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ తో ఈ సినిమాని ఎంత బాగా తీసుంటాడో నేను ఊహించగలను. కళ్యాణ్ లుక్ వండర్ ఫుల్ గా ఉంది. ప్రతి సినిమా గుర్తింపు రావాలి నేను నేనుగా ఉంటాను అంటూ కళ్యాణ్ చేసే సినిమాల్లో ఆ ప్రత్యేకత కనిపిస్తుంది. ముఖ్యంగా కళ్యాణ్ తపన కనిపిస్తుంది. కళ్యాణ్ ఇంత కష్టపడుతున్నాడు హిట్ ఇద్దాం అనే భావన ప్రజల్లోఉంది. ఆల్ ది బెస్ట్ కళ్యాణ్.ఇక ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే.... నాలాంటివాడు గర్వించే ఏక్టర్ అంటే ఎన్టీఆర్. తెలుగు సినిమాల్లో బూతు కూడా అందంగా ఉంది అంటే అది పూరి సినిమాల్లోనే. అందులో కూడా ఓ భావన చూపిస్తాడు. తెలుగు సినిమాల్లో మాస్ కి క్లాస్ టచ్ ఇచ్చే ఒకే ఒక్క డైరెక్టర్ పూరి జగన్నాథ్. ప్రతి నటుడ్ని కొత్తగా ఎలా చూపిస్తాడో నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. భాస్కరభట్లతో కలిసి నేను వర్క్ చేయడం గర్వంగా ఫీలవుతున్నాను. ఈ సినిమా కళ్యాణ్ కోసం ఆడాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ... పూరి జగన్నాథ్ కసిగా సినిమా తీయాలని ప్రయత్నిస్తారు. ఇజం సినిమాని హీరో & ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్, పూరి జగన్నాథ్ కలిసి కసిగా తీసారు. ఇది పెద్ద సక్సెస్ అవుతుంది. నాకు మరో ఇడియట్ కనిపిస్తుంది అన్నారు.
గీత రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ.... ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో పనిచేయడం ఫస్ట్ టైమ్. పూరి జగన్నాథ్ అన్నతో నాకు ఇది 24వ సినిమా. ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఇంకా నేర్చుకుంటుంటాను. కళ్యాణ్ రామ్ గారి సినిమాకి ఫస్ట్ టైమ్ రాసాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఆలీ మాట్లాడుతూ... హీరో కళ్యాణ్ రామ్ మనసు చాలా మంచిది. అలాగే మనిషి చాలా మంచోడు. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చానని గర్వంగా ఏమాత్రం లేదు. డైరెక్టర్ పూరి చాలా మంచి మనిషి. మంచి వాళ్లకు భగవంతుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. ఇడియట్, పోకిరి, టెంపర్ మూడు అక్షరాలు. మూడు అక్షరాలతో వస్తున్న ఇజం కూడా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
తనికెళ్లభరణి మాట్లాడుతూ... నర్సీపట్నం కుర్రాడైన పూరి సినిమాని ప్రేమించి సినిమాకే తాళి కట్టేసాడు. సినిమా అంటే పూరికి అంత ఇష్టం. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం నుంచి పూరి గ్రాఫికల్ గా ఎంత పెరిగినా అలాగే ఉన్నాడు. ఈ సినిమా గురించి చెప్పాలంటే....క్లైమాక్స్ లో కళ్లంట నీళ్లు వచ్చాయి. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. 100% సక్సెస్ అవుతుంది అన్నారు
హీరోయిన్ అదితి ఆర్య మాట్లాడుతూ... పూరి జగన్నాథ్ గారు లాంచ్ చేసిన హీరోయిన్స్ అందరూ బిగ్ స్టార్స్ అయ్యారు. పూరి గారి సినిమా ద్వారా హీరోయిన్ గా లాంఛ్ అవ్వడం అనేది డ్రీమ్ లా అనిపిస్తుంది. ప్రతి రోజు కళ్యాణ్ గారితో పూరి గారితో కలిసి వర్క్ చేయడం అనేది బిగ్గెస్ట్ గిఫ్ట్. ఫస్ట్ హీరో కళ్యాణ్ గారితో వర్క్ చేయడం ఎలా అని కాస్త టెన్షన్ పడ్డాను. ఆయన్ని కలిసిన తర్వాత టెన్షన్ పోయింది. ఎలా నటిస్తే బాగుంటుందో నన్ను గైడ్ చేసేవారు చాలా ఇన్ స్పైయార్ చేసారు. అనూప్ మ్యూజిక్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇజం టీమ్ అందరికీ థ్యాంక్స్ అన్నారు.
డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ... లేట్ అయినా మంచి సినిమా చేసాం అనే సంతృప్తి ఉంది. ఇజం టీజర్ హరికృష్ణ గారికి తెగ నచ్చింది. నాకు రెండు పావురాలు గిఫ్ట్ గా ఇచ్చారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం 13 కిలోలు బరువు తగ్గాడు. 13 కిలోలు తగ్గి చేయడం చిన్న విషయం కాదు. హరికృష్ణ గారు కళ్యాణ్ రామ్ ఏక్టింగ్ చూసి ప్రౌండ్ ఫీలవుతారు. ముఖ్యంగా కోర్టు సీన్ చేసాడు అదరగొట్టేసాడు. కోర్టు సీన్ లు అన్నీ నందమూరి హీరోల అకౌంట్ లోనే ఉన్నాయి. ఇజం సినిమాలో కోర్టు సీన్ ని తారక్ కి చూపించాను. ఆ సీన్ చూసి ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. అంతలా తారక్ ని ఆకట్టుకుంది. అనూప్ చాలా మంచి పాటలు ఇచ్చాడు. నాకు పాట రాసి పాడే అవకాశం ఇచ్చాడు. ఇక హీరోయిన్ అదితి చాలా కష్టపడింది తెలుగు నేర్చుకుని డైలాగలు చెప్పింది. మా సినిమా చాలా చాలా బాగా వచ్చింది. మా టీమ్ అందరికీ థ్యాంక్స్అన్నారు.
నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ... నాకు 60 ఏళ్లు. ఈ 60 ఏళ్లలో ఎవరు అనుభవించలేని క్షణాలు అనుభూతులు నేను పొందాను. నందమూరి అంటేనే రామారావు గారు ఆయన దగ్గర 30 ఏళ్లు పనిచేసాను. 30 ఏళ్లలో ఎన్నో అనుభూతులు. ఎన్నో విజయాలు..ఎన్నో పోరాటాలు చూసాం. పార్టీ పెట్టి విజయం సాధించాం. వారి దగ్గర నుంచి పొందింది ఏమిటంటే వీరాభిమానులును పొందాను. డబ్బు దొంగలు పట్టుకోవచ్చు కానీ...అభిమానం అనేది తస్కకరించలేనిది. ఇక 59వ ఏట నా బిడ్డల సినిమాలు నాన్నకు ప్రేమతో, పటాస్ అనే హిట్ సినిమాలు చూసాను. 60 వచ్చేటప్పటికీ జనతా గ్యారేజ్ చూసాను. నా తరుపున గిఫ్ట్ అని నా బిడ్డ చెప్పడం ఆనందం కలిగించింది. 60వచ్చిన తర్వాత రెండో బిడ్డ హిట్ కొట్టబోతున్నాడు. వీటన్నింటికంటే ముందు టెంపర్ పటాస్ రెండింటి ఆడియో ఫంక్షన్స్ కి పెద్ద బిడ్డ జానకిరామ్ ఉండాలి. ఇద్దరు హిట్స్ కొడతాడు అని చెప్పి అనంతలోకంకు వెళ్లిపోయాడు. ఆయన దీవెనతో హిట్స్ వచ్చాయి అనుకుంటున్నాను. ఈ సినిమాని ప్రజలు ఆదరించి హిట్ కొట్టించాలి. ఇక డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు నా బిడ్డ కళ్యాణ్ తో బాగా చేయించారు హ్యాట్సాఫ్. ఓరోజు పూరి ఇంటికి వెళ్లాను ఆయన సతీమణి కాఫీ ఇచ్చారు. నా జీవితంలో మరచిపోలేను.అనూప్ సంగీతం చాలా బాగుంది. ఏదైనా సంగీతం ద్వారానే సగం బయటకు వస్తుంది. సంగీతం సక్సెస్ అయితే సగం సక్సెస్ సాధించినట్టే. భాస్కరభట్ల మంచి పాటలు అందించాడు. తెర ముందు, తెర వెనక పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. జీవితంలో ఎవడికీ తల వంచను తలవంచేవాడినే అయితే ఆయన కొడుపున పుట్టేవాడిని కాదు. ఎన్టీఆర్ జిందాబాద్ అన్నారు.
హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... చాలా మాట్లాడాలి అని ఉంది. కానీ..నేను సినిమా రిలీజ్ టైమ్ లో మాట్లాడతాను. మా డైరెక్టర్ గారు ఫిబ్రవరి 4న మనం సినిమా చేస్తున్నాం అని ఓకే చెప్పారు. ఆరోజును ఎప్పటికీ మరచిపోలేను. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఇజం టీమ్ బెస్ట్ టీమ్. ఫారిన్ లో అసలు అలసట లేకుండా టీమ్ వర్క్ చేసారు. ప్రతిరోజు షూటింగ్ కి వెళ్లాలి అనే ఉత్సాహం కలిగించారు. ఇలాంటి టీమ్ ను ఇప్పటి వరకు చూడలేదు. పూరి గారు గురించి మాట్లాడాలంటే ఒక గంట మాట్లాడతాను. ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహంగా చేసాం. నా బెస్ట్ డైరెక్టర్ అంటే పూరి జగన్నాథ్. భాస్కరభట్ల మంచి పాటలు అందించారు. నేను ఏ రోజు ఇజం టీమ్ ని మరచిపోను. వెంటనే పూరి గారితో ఇంకో సినిమా చేయాలిని ఉంది అన్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.... ముందుగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గురించి చెప్పాలి. టెంపర్ షూటింగ్ జరుగుతున్నప్పుడు మ్యూజిక్ ఎవరితో చేయిద్దాం అని పూరి భయ్యతో డిష్కస్ చేస్తుంటే....ఆయన మీ ఇష్టం అన్నారు అప్పుడు అనూప్ తో చేద్దాం అన్నాను. అయన ఓకే అన్నారు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో అనూప్ మెలీడో సాంగ్స్ ని ప్రజెంట్ చేసినట్టుగా ఇంకెవరూ చేయలేరు అనిపిస్తుంది. మనం, టెంపర్ సినిమాల్లో అనూప్ మెలోడి సాంగ్స్ చూసి చాలా ప్రౌండ్ గా, హ్యాపీగా ఫీలవుతున్నాను.
నేను, జగన్ గారు కలిసి ఉన్నప్పుడు కళ్యాణ్ రామ్ అన్నతో ఓ మూవీ డిష్కసన్ జరుగుతుంది అని తెలిసింది. ఆ టైమ్ లో ఆయనే కళ్యాణ్ గారితో ఓ కథ అనుకుంటున్నాను అని చెప్పారు. ఏకథ అని అడిగాను. అది గుర్తుంది కదా.. ఇజం అనగానే ఫస్ట్ నేనే కళ్యాణ్ అన్నకిఫోన్ చేసి కన్ ఫర్మ్ అయ్యింది చెప్పాను. నాకు జగన్ గారంటే బాగా ఇష్టం. ఆయన సక్సెస్ రేటు పక్కన పెడితే కళ్యాణ్ అన్న పూరి భయ్య కలిసి సినిమా చేయాలి అని అనుకునేవాడిని. నేను జగన్ గారితో టెంపర్ చేయకముందు ఒకటి, టెంపర్ చేసిన తర్వాత ఒమరొకటి. ఎందుకంటే...నాలో ఇంత కాన్ఫిడెన్స్ పెరిగింది అంటే దానికి మొదలు టెంపర్. నాకు జగన్ గారితో కలిసి పనిచేస్తే నాలో కొత్తకోణం చూపిస్తారని స్వార్ధం. కళ్యాణ్ అన్నను ఇలా చూస్తాను అనుకోలేదు. లుక్స్ అమేజింగ్... బాడీలుక్స్ గురించి అటిట్యూడ్ గురించి పూరి భయ్యకి థ్యాంక్స్ చెబుతున్నాను. పూరి భయ్య గురించి మాట్లాలంటే.... ఫిలాసిఫర్, ఫ్రెండ్. ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం ప్రత్యక్షంగా చూసాను. కళ్యాణ్ అన్న పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఇజం కళ్యాణ్ అన్న కెరీర్ లో ప్రధమంగా నిలబడుతుంది అని నమ్మకం. జెన్యూన్ గా కష్టపడితే ఎక్కడికి పోదు ఇంకా ప్రొత్సహిస్తుంది అని మనసావాచా నమ్ముతున్నాను. భాస్కరభట్ల అద్బుతమైన పాటలు అందించారు. కత్తి కంటే కలం చాలా గొప్పది. ఆ కత్తి కంటే కలం ఎంత గొప్పదో నిరూపించే సినిమా ఇజం. కలం బలం అందరికీ గుర్తు చేస్తుంది. ఇజం సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తుంది అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments