మహేష్ ను దాటేసిన ఎన్టీఆర్...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం నాన్నకు ప్రేమతో. రివేజండ్ డ్రామాతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం సినిమా స్పెయిన్‌లో చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని యూనిట్ భావిస్తుంది.
సినిమా బిజినెస్ హాట్ కేక్‌లా జరిగిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సీడెడ్ ఏరియాలో 8.5కోట్లకు అమ్ముడైపోయి సీడెడ్ ఏరియాలోనందమూరి వారి ప్రాభవాన్ని చాటింది. మహేష్ గత చిత్రం శ్రీమంతుడు సీడెడ్‌లో 7.3కోట్లకు మాత్రమే అమ్ముడైందట. అంటే మొత్తం మీద సీడెడ్ ఏరియాలో ఎన్టీఆర్ తన పట్టు చూపించడమే కాకుండా బిజినెస్ పరంగా మహేష్‌ను దాటేశాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com