రాజకీయాల పై ఎన్టీఆర్ మనసులో మాట..!

  • IndiaGlitz, [Wednesday,August 31 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ న‌టించిన జ‌న‌త గ్యారేజ్ చిత్రం సెప్టెంబ‌ర్ 1న రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా జ‌న‌తా గ్యారేజ్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్ ని ప్ర‌స్తుత రాజ‌కీయాల గురించి అడిగితే...ఇప్పుడు అస‌లు రాజ‌కీయాల జోలికి వెళ్ల‌డం లేదు.
న‌టుడిగా బిజీగా ఉన్నాను. తెలుగుదేశం పార్టీతో నా అనుబంధం అలాగే ఉంది. సంద‌ర్భానుసారం ఒక‌ప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్ర‌చారం చేసాను. ఆ పీరియ‌డ్ పూర్త‌య్యింది. నేను న‌టుణ్ణి. నా ఆలోచ‌న అంతా సినిమాల గురించే. రాజ‌కీయాల ఆలోచ‌న అస‌లు లేదు అంటూ రాజ‌కీయాల గురించి త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు యంగ్ టైగ‌ర్..!