జీవితం అంటే ఏమిటో ఎన్టీఆర్ కి అప్పుడు తెలిసింది అట..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్ అంటే మంచి నటుడు అని తెలుసు...అంతకు మించి మంచి డ్యాన్సర్ అని తెలుసు..! జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ ప్రసంగం విన్నాకా...ఎన్టీఆర్ అంటే మంచి పెర్ ఫార్మర్ & డ్యాన్సర్ మాత్రమే కాదు... జీవిత సత్యం తెలుసుకున్న జ్ఞాని అని తెలిసింది. ఇంతకీ ఎన్టీఆర్ ఏమన్నాడంటే... నిన్నుచూడాలని, స్టూడెంట్ నెం1, ఆది సింహాద్రి...ఇలా సక్సెస్ వస్తుంటే బాగానే ఉంది అనిపించింది. చిన్న వయసు కదా అర్ధం కాలేదు. ప్రతి మనిషి క్రిందకి పడితేనే జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పుడప్పుడు దేవుడు మొట్టికాయలు వేసి కిందకి పంపిస్తాడు. ఈ విషయం చాలా రోజులు అర్ధం కాలేదు. ఆతర్వాత తెలుసుకున్నాను. ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు అభిమానులు ఎంత బాధపడ్డాలో నాకు తెలుసు. ఆ టైమ్ లో నాలో నేను కుమిలిపోయాను అంటూ తన మనసులో మాటలు బయటపెట్టారు యంగ్ టైగర్..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout