ఎన్టీఆర్ పల్లవే?
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో సుధీర్ బాబు రేపు ప్రేక్షకులను 'సమ్మోహనం' చేయడానికి సిద్ధమవుతున్నాడు. హీరోగానే కాదు నిర్మాతగా కూడా రీసెంట్‌గా తన కెరీర్‌లో కొత్త అధ్యాయానికి సుదీర్ తెరతీసిన సంగతి తెలిసిందే. సుధీర్ స్వంత నిర్మాణ సంస్థ సుధీర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఆర్.ఎస్.నాయుడు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు 'న్ను దోచుకుందువటే' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ నటించిన 'గులేబకావళి' సినిమాలో హిట్ సాంగ్ నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అనే పాటలోని పల్లవినే ఈ సినిమా టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com