పాట పాడుతున్న యంగ్ టైగర్..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నతాజా చిత్రం నాన్నకు ప్రేమతో..ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న నాన్నకు ప్రేమతో చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మంచి నటుడు, డాన్సర్ మాత్రమే కాదు. సింగర్ కూడా. గతంలో ఎన్టీఆర్ యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస చిత్రాల్లో పాట పాడిన విషయం తెలిసిందే.
ఇప్పుడు నాన్నకు ప్రేమతో..సినిమాలో కూడా ఎన్టీఆర్ తో ఓ పాట పాడించాలనుకుంటున్నాడట దేవిశ్రీప్రసాద్. ఈ విషయాన్ని దేవిశ్రీప్రసాదే స్వయంగా మీడియాకి చెప్పారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. దీని తర్వాత ఎన్టీఆర్ తో పాట పాడిస్తారట. మరి ఎన్టీఆర్ పాడిన పాటలు మంచి హిట్ అయ్యాయి. నాన్నకు ప్రేమతో...సినిమాలో ఎన్టీఆర్ పాడే పాట కూడా హిట్ అవుతుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com