ఎన్టీఆర్ కి షాకిచ్చిన సినిమా..
Tuesday, May 17, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఏక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ల్లో అద్భుత అభినయం కనబరిచి మాస్ ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇటీవల ఓ సినిమా షాకిచ్చిందట. అయితే షాక్ ఇచ్చిన ఆ సినిమా ఎన్టీఆర్ సినిమాయే కావడం ఓ విశేషం అయితే..ప్లాప్ మూవీ షాకివ్వడం మరో విశేషం. ఇంతకీ విషయం ఏమిటంటే...ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం దమ్ము.
సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అంచనాలను అందుకోలేక ఫ్లాప్ మూవీగా నిలిచింది. అయితే దమ్ము చిత్రాన్ని హిందీలో సుల్తాన్ టైటిల్ తో డబ్ చేసారు. రెండు నెలల క్రితం సుల్తాన్ చిత్రాన్ని యుట్యూబ్ లో అప్ లోడ్ చేసారు. ఈ చిత్రాన్ని నెట్ లో విరగబడి చూస్తున్నారు. రెండు నెలల్లోనే ఎన్టీఆర్ సుల్తాన్ (దమ్ము) చిత్రాన్ని 87,08,568 మంది చూసారు. కోటి మార్క్ కి దగ్గరలో ఉంది. ఈ విషయం తెలుసుకుని ఎన్టీఆర్ షాక్ అయ్యాడట. అది సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments