ఎన్టీఆర్ - శర్వానంద్ సేమ్ టు సేమ్..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో..చిత్రంతో 25 చిత్రాలను పూర్తి చేసుకున్నారు. ఎన్టీఆర్ 25వ చిత్రాన్నిసుకుమార్ తెరకెక్కించగా... బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే...యువ కథానాయకుడు శర్వానంద్ రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా..చిత్రాలతో హ్యాట్రిక్ సాధించాడు.
డిఫరెంట్ మూవీస్ చేస్తూ యూత్ లో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న శర్వానంద్ కూడా 25వ చిత్రానికి రెడీ అవుతున్నాడు. శర్వా 25వ చిత్రాన్ని ఓ నూతన దర్శకుడుతో ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం కథా చర్చలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే నెలలో ప్రారంభించనున్నారు. అయితే... ఎన్టీఆర్ 25 వ చిత్రాన్ని నిర్మించిన భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాదే...శర్వానంద్ 25వ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments