ప్రయోగాలు వద్దంటున్న యంగ్ టైగర్..!
- IndiaGlitz, [Thursday,November 10 2016]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాతో బ్లాక్ బష్టర్ సాధించిన తర్వాత తదుపరి చిత్రం పై చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత పూరి జగన్నాథ్ తో సినిమా చేయనున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే...పూరి చెప్పిన కథ నచ్చలేదో వేరే కారణం వలనో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి లేదు. పూరి తర్వాత యంగ్ డైరెక్టర్స్ అనిల్ రవిపూడి, చందు మొండేటి కథలు చెప్పారు.
ఈ కథలు విన్న ఎన్టీఆర్ వేరే కథలతో రమ్మన్నాడట. కారణం ఏమిటంటే...అనిల్ రవిపూడి, చందు మొండేటి ప్రయోగాత్మక కథలు చెప్పారట. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రేక్షకులును ఆకట్టుకునే మాస్ మసాలా మూవీ చేయాలి అనుకుంటున్నాను. అందుచేత ప్రయోగాలు వద్దు..మాస్ మసాల కథలే ముద్దు అన్నట్టు ఎన్టీఆర్ తన నిర్ణయాన్ని చెప్పేసాడట. అనిల్ రవిపూడి, చందు మొండేటి ఎన్టీఆర్ కోరుకున్నట్టుగా మాస్ మసాలా స్టోరీస్ రెడీ చేసి వినిపిస్తారో లేదో..? ఫైనల్ గా ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఏ డైరెక్టర్ కి వస్తుందో చూడాలి..!