జై బాలయ్య అంటూ ఎన్టీఆర్ హంగామా
- IndiaGlitz, [Monday,December 31 2018]
నందమూరి కుటుంబానికి చెందిన బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ఈ మధ్య కలిసిపోయారు. ఎన్టీఆర్ 'అరవింద సమేత'కు బాలయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు.
కాగా బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న 'యన్.టి.ఆర్' ఆడియో వేడుకకి ఎన్టీఆర్ హాజరయ్యారు. రీసెంట్గా బాబాయ్ బాలయ్యపై ఉన్న అభిమానాన్ని ఎన్టీఆర్ చూపించుకున్నారు.
రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం ప్రముఖ నటుడు జగపతిబాబు సోదరుడి కుమార్తి పూజతో జరిగింది. ఈ వేడుకలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ జై బాలయ్య అంటూ హంగామా చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. ఈ వేడుకలో రాంచరణ్, ప్రభాస్, రానా, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.