ఎన్టీఆర్-బన్సాలి చిత్రం తాజా అప్డేట్‌ ఇదీ..!

  • IndiaGlitz, [Monday,May 04 2020]

బాలీవుడ్ ద‌ర్శక నిర్మాత సంజ‌య్ లీలా బ‌న్సాలీ భారీ బడ్జెట్‌తో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ను హీరోగా పెట్టి సినిమా తీస్తారని వార్తలు వస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో.. వెబ్‌సైట్లలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చేస్తున్నాయి. ఇంతవరకూ అటు ఎన్టీఆర్ నుంచిగానీ ఇటు బన్సాలీ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అసలు ఇందులో నిజానిజాలెంతో తెలియరావట్లేదు కానీ పుకార్లు మాత్రం గట్టిగానే షికార్లు చేస్తున్నాయి. క్లారిటీ ఇవ్వకపోవడంతో నందమూరి, ఎన్టీఆర్ అభిమానుల్లో కాసింత ఆందోళన నెలకొంది.

ఇదీ తాజా అప్డేట్..

ఇదివరకు వచ్చిన వార్తల ప్రకారం.. ఎన్టీఆర్ హీరో అని ఈయనకు విలన్‌గా రణ్‌వీర్‌ సింగ్‌ను తీసుకుంటున్నారని తెలిసింది. అయితే తాజాగా అదేం కాదని దీనికి రివర్స్ అనగా.. రణ్‌వీర్ హీరో అని యంగ్ టైగర్ విలన్ అని వార్తలు వస్తున్నాయి. ఇదే తాజా అప్డేట్. ‘జై లవకుశ’లో ఎన్టీఆర్ విలనిజం చూసిన బన్సాలీ ఫిదా అయిపోయాడని అందుకే విలన్‌గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. జూనియర్ బర్త్ డే రోజున ఎవరూ ఊహించని విధంగా అప్డేట్‌తో నందమూరి అభిమానులకు బన్సాలీ గిఫ్ట్ ఇస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే మాత్రం ఎన్టీఆర్ రేంజ్ ఎక్కడికో వెళ్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మూవీ విషయంలో నిజానిజాలెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.

More News

సాధినేని యామినికి అమెరికాలో అరుదైన గౌరవం

ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన బీజేపీ నాయకురాలు సాధినేని యామిని శర్మకు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని భారతీయ యువ పారిశ్రామికవేత్తల

దాస‌రి గురించి చిరు, మోహ‌న్‌బాబు ఏమ‌న్నారంటే..?

ఈరోజు ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు 73వ జ‌యంతి. ఈ రోజు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మంతా క‌లిసి డైరెక్ట‌ర్స్ డే కూడా ప్ర‌క‌టించుకున్నారు. ఈరోజు ఉద‌యం ఫిలించాంబ‌ర్‌లో ఆయ‌న విగ్ర‌హానికి పూల‌మాల

రాజ‌మౌళి 'ఆర్ఆర్ఆర్‌' రిలీజ్ ప్లాన్ మార్పు

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌). ఇందులో మ‌న్యం వీరుడు

చిరు 153లో స‌ల్మాన్‌..?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ను పూర్తి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీని తర్వాత చిరంజీవి ఎక్కువ గ్యాప్ తీసుకోవాల‌నుకోవ‌డం లేద‌ట‌.

సూర్య‌కు జోడీగా రాశీఖ‌న్నా

హీరో సూర్య త‌న 38వ చిత్రం శూర‌రై పోట్రు(ఆకాశం నీ హ‌ద్దురా)ని కరోనా ప్రభావం తగ్గిన తర్వాత విడుద‌ల చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలుజ‌రుగుతున్నాయి.