ఎన్టీఆర్-బన్సాలి చిత్రం తాజా అప్డేట్ ఇదీ..!
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ భారీ బడ్జెట్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను హీరోగా పెట్టి సినిమా తీస్తారని వార్తలు వస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో.. వెబ్‌సైట్లలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చేస్తున్నాయి. ఇంతవరకూ అటు ఎన్టీఆర్ నుంచిగానీ ఇటు బన్సాలీ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అసలు ఇందులో నిజానిజాలెంతో తెలియరావట్లేదు కానీ పుకార్లు మాత్రం గట్టిగానే షికార్లు చేస్తున్నాయి. క్లారిటీ ఇవ్వకపోవడంతో నందమూరి, ఎన్టీఆర్ అభిమానుల్లో కాసింత ఆందోళన నెలకొంది.
ఇదీ తాజా అప్డేట్..
ఇదివరకు వచ్చిన వార్తల ప్రకారం.. ఎన్టీఆర్ హీరో అని ఈయనకు విలన్‌గా రణ్‌వీర్ సింగ్‌ను తీసుకుంటున్నారని తెలిసింది. అయితే తాజాగా అదేం కాదని దీనికి రివర్స్ అనగా.. రణ్‌వీర్ హీరో అని యంగ్ టైగర్ విలన్ అని వార్తలు వస్తున్నాయి. ఇదే తాజా అప్డేట్. ‘జై లవకుశ’లో ఎన్టీఆర్ విలనిజం చూసిన బన్సాలీ ఫిదా అయిపోయాడని అందుకే విలన్‌గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. జూనియర్ బర్త్ డే రోజున ఎవరూ ఊహించని విధంగా అప్డేట్‌తో నందమూరి అభిమానులకు బన్సాలీ గిఫ్ట్ ఇస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే మాత్రం ఎన్టీఆర్ రేంజ్ ఎక్కడికో వెళ్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మూవీ విషయంలో నిజానిజాలెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com