ఆ వార్తలను కొట్టిపారేసిన ఎన్టీఆర్...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్, నవభారత్ నేషనల్ పార్టీని స్థాపించబోతున్నాడని రీసెంట్గా సోషల్‌మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. ఇదే విషయమైన జై లవకుశ షూటింగ్లో ఉన్న ఎన్టీఆర్‌ను ఆయన అభిమానులు అడిగారట. అయితే నేను ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇప్పట్లో రాజకీయాలకు సంబంధించిన ఆలోచనలే లేవు.
ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే తప్పకుండా నేనే చెబుతాను అంటూ చెప్పుకొచ్చాడని సమాచారం. ఎన్టీఆర్, బాబీ, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్లో `జై లవకుశ` సినిమా సెట్స్‌లో ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. నివేదాథామస్, రాశిఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com