త్రివిక్రమ్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర అదేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
జైలవకుశలో మూడు విభిన్న పాత్రలు చేసి మెప్పించాడు యంగ్‌టైగర్ ఎన్టీఆర్. ముఖ్యంగా ఆయన పోషించిన జై పాత్రకి సర్వత్రా మంచి స్పందన వచ్చింది. వసూళ్ల విషయంలోనూ ఈ సినిమా కొన్ని చోట్ల కొత్త రికార్డులను సొంతం చేసుకుంటోంది. ఇదిలా ఉంటే.. జైలవకుశ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు తారక్.
ఇందులో తను ఇదివరకు చేయని ఓ కొత్త పాత్ర చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అదేమిటంటే.. మిలటరీ ఆపరేటర్ ఆఫీసర్‌గా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. టెంపర్ నుంచి ప్రతి సినిమాకి తన పాత్రల్లో వేరియేషన్ చూపిస్తున్న తారక్.. త్రివిక్రమ్ సినిమాలోనూ దాన్ని కొనసాగించబోతున్నాడన్నమాట. అను ఇమ్మానియేల్ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments