హైదరాబాద్‌కు తిరిగొచ్చిన తారక్‌

  • IndiaGlitz, [Thursday,November 19 2020]

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. అదేంటి? తారక్‌ ట్రిపుల్‌ ఆర్ సినిమా షూటింగ్‌లో లేడా? అనే సందేహం రాకమానదు. నిజానికి తారక్‌ పార్ట్‌ను ఈ షెడ్యూల్‌లో షూట్‌ చేయడానికి దర్శకధీరుడు రాజమౌళి కాస్త గ్యాప్‌ ఇచ్చాడు. ఈ గ్యాప్‌లో తారక్‌ ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌ వెళ్లాడు. దుబాయ్‌కి ట్రిప్‌కి వెళ్లిన తారక్‌ అనుకున్న టైమ్‌లోనే హైదరాబాద్‌ చేరుకున్నాడు. తారక్‌ అండ్‌ ఫ్యామిలీ ఎయిర్‌పోర్టులో ఉన్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వెంటనే తారక్‌ 'ఆర్‌ఆర్‌ఆర్' షూటింగ్‌లో జాయిన్‌ అవుతున్నాడట. ఇక 'ఆర్‌ఆర్‌ఆర్‌' విషయానికి వస్తే జక్కన్న అండ్‌ టీం చరణ్‌ అండ్‌ ఇతర టీమ్‌తో రాత్రి వేళ యాక్షన్‌ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు.

కోవిడ్‌ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమా రీసెంట్‌గా రీస్టార్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా మేజర్‌ పార్ట్‌ చిత్రీకరణను పూరిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా తారక్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తోన్న ఈ సినిమాలో ఇతర కీలకపాత్రల్లో నటిస్తోన్న బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌, హాలీవుడ్‌ స్టార్‌ ఓలివియా మోరిస్‌ ఇతర తారలు కొందరు తదుపరి షెడూల్‌లో జాయిన్‌ అవుతున్నారు.రూ.450 కోట్ల రూపాయల భారీ బడ్టెట్‌తో, భారీ ప్యాన్‌ ఇండియా తారాగణంతో రూపొందుతోన్న ఈ ఫిక్షనల్‌ పీరియాడికల్‌ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా 2021లో విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేసుకుంటున్నారు.