ఎన్టీఆర్ స్థానంలో ...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్టార్ట్ కావడానికి వ్యవథి ఎక్కువగా ఉంది. ఈలోపు ఎన్టీఆర్ దిల్‌రాజు నిర్మాణంలో ఓ సినిమా చేస్తాడని వార్తలు కూడా వచ్చాయి.
దిల్‌రాజు పనిలో పనిగా తనతో శతమానం భవతి వంటి హిట్ చేసిన దర్శకుడు సతీష్ వేగేశ్నతో ఎన్టీఆర్‌కు కథ వినిపించాడు. అయితే ఎన్టీఆర్ ఈ సినిమాలో చేయకుండా తప్పుకున్నాడు. ఇప్పుడు అదే కథను హీరో నితిన్ చేయబోతున్నాడని సమాచారం.
త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారం రానుంది. అంటే ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో తప్ప, మరో దర్శకుడితో సినిమా చేసే ఆలోచనలో లేనట్లే కదా..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments