'ఎవరు మీలో కోటీశ్వరులు' కోసం ఎన్టీఆర్ ఎంత తీసుకుంటున్నాడంటే..!
Send us your feedback to audioarticles@vaarta.com
సోషల్ మీడియా ఉధృతి పెరిగింది. ముఖ్యంగా డిజిటల్ మీడియా చేతిలోకి వచ్చిన తర్వాత స్టార్స్ గురించిన వివరాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. స్టార్ హీరోలు సైతం బుల్లితెర, డిజిటల్ మీడియాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ నేటితరం అగ్ర కథానాయకుల్లో ఒకడైన ఎన్టీఆర్ బుల్లితెరపై ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యాడు. బుల్లితెరపై ఎన్టీఆర్ ప్రేక్షకులను మెప్పించడం కొత్తేమీ కాదు. ఇది వరకే బిగ్‌బాస్ రియాలిటీ షో సీజన్ 1కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ గేమ్ షో ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాడు.
ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం క్రేజీ విషయమే. అయితే ఈ షోకు మరి ఎన్టీఆర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు? అనే దానిపై చాలా రకాలైన వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సమాచారం మేరకు ఓ షోకు ఎన్టీఆర్ కోటి ఇరవై లక్షల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నాడట. మొత్తం గేమ్ షో 30 ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు. అంటే రెమ్యునరేషన్ ముప్పై ఐదు కోట్ల రూపాయలను దాటేస్తుందని టాక్ వినిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com