కొత్త ఒరవడికి సిద్ధమంటున్న తారక్
Send us your feedback to audioarticles@vaarta.com
రాజమౌళి సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ ఆయనే ఇస్తే బావుంటుందని అంటున్నారు ఎన్టీఆర్. చరణ్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు. `ఆర్ ఆర్ ఆర్` కు సంబంధించిన విశేషాలను చెప్పకూడదని లేదు అని, అయితే వాటి గురించి తనకు పూర్తిగా తెలియదనీ అన్నారు. ఈ ఏడాది చివరి నుంచి షూటింగ్ ఉండొచ్చని తెలిపారు. మంచి కథలతో, స్టార్లను డీల్ చేయగల కెప్టెన్లు ఉంటే కొత్త ఒరవడి సృష్టించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధమేనని అన్నారు తారక్.
యంగ్ హీరోలందరూ ఆ దశగానే ఆలోచిస్తున్నారని అన్నారు. అరవింద సమేత తనలో మంచి మార్పు తెచ్చిందని, మానసిక ప్రశాంతత ఉంటే ఇంకేదీ అక్కర్లేదనీ. సినిమా హిట్లు, ఫ్లాప్‌లు మనసుకు ఎక్కించుకోననీ , హిట్ అయినా, ఫ్లాప్ అయినా నాలుగు రోజులే ఆ ధ్యాస ఉంటుందని చెప్పారు. కాకపోతే అభిమానులే మార్కెట్లో బయట ఉంటారు కాబట్టి, వారి మీదే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments